Rohit Sharma Retirement ( Image Source: Twitter)
Viral

Rohit Sharma Retirement: బిగ్ బ్రేకింగ్.. సంచలన నిర్ణయం తీసుకున్న రోహిత్ శర్మ..

Rohit Sharma Retirement: టీమిండియా రథసారథి రోహిత్ శర్మ క్రీడాభిమానులకు చేదువార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. బుధవారం నుంచే రిటైర్మెంట్ అమలు అవుతుందని పేర్కొన్నాడు. ‘ అందరికీ నమస్కారం. నేను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికా. ఈ విషయాన్ని మీకు చెబుతున్నా. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాపై ప్రేమ చూపించి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతా’ అని రోహిత్ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. హిట్ మ్యాన్ నిర్ణయంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు, రోహిత్ అభిమానులు షాక్ తిన్నారు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని ఆయన ప్రకటించడంతో అభిమానులు కాసింత ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే జూన్‌లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్తోంది. అయితే జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్‌ పంత్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరందరిలో బూమ్రాకే కెప్టెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read Also- Pallavi Prashanth: కూరగాయలు అమ్ముతున్న పల్లవి ప్రశాంత్.. రావాలమ్మో అంటూ కేకలు.. వీడియో వైరల్

ట్రాక్ రికార్డ్ ఇదీ..
38 ఏళ్ల రోహిత్ 2013లో టెస్టుల్లో ఆరంగేట్రం చేసి ఇప్పటివరకూ 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచుల్లో మొత్తం 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ను విజయతీరానికి చేర్చి శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాదు రోహిత్ సారథ్యంలోనే టీమిండియా రెండుసార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్‌లో హిట్ మ్యాన్ పెద్దగా రాణించలేక పోతున్నాడనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌ల్లో అతడి కెప్టెన్సీ కూడా ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే రోహిత్ సారథ్యంలోని టీమిండియా గత ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓటమి పాలైంది. మరోవైపు వ్యక్తిగతంగా కూడా రోహిత్ శర్మ కొన్నిరోజులుగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని అభిమానులే తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్ట్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు.

Read Also- Sreeja Marriage: శ్రీజకు చిరంజీవి అందుకే మూడో పెళ్లి చేయలేదా?

ఎన్నో కప్పులు.. అంతకుమించి సమస్యలు..
ఇండియన్ క్రికెట్‌ హిస్టరీలో రోహిత్‌ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. హిట్‌మ్యాన్‌గా పేరు సంపాదించుకుని అన్ని ఫార్మాట్‌లలో మన ఇండియాకు ఎన్నో కప్పులను తెచ్చి పెట్టాడు. కెప్టెన్‌గా చేసేటప్పుడు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. కొంత కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో రోహిత్‌ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇదే కాకుండా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌లో మెరుగైన ప్రదర్శన కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ను బీసీసీఐ వర్గాలు కెప్టెన్‌గా తప్పించినట్లుగా పలువురు చెబుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కంటే ముందే ఇలా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. రోహిత్ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా సెలెక్టర్లే ఫైనల్ అని గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు సెలెక్టర్లు ముందే చెప్పడంతో ఇక టెస్ట్‌ ఫార్మాట్‌కే పూర్తిగా దూరమవ్వాలని రోహిత్‌ భావించి ఇలా రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Read Also-Colonel Sophia Qureshi: ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా.. ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే…?

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ