Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అరుదైన డెలివరీ జరిగింది. క్రిటికల్ కండీషన్ గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసి తల్లి, బిడ్డలను వైద్యులు, స్టాఫ్ కాపాడారు. పాల్వంచ మండలం రేపల్లేవాడకు చెందిన జూపల్లి పల్లవి అనే మహిళ తన రెండో కాన్ఫు కోసం పాల్వంచ ఏరియా ఆసుపత్రికి రాగా, పరీక్షించిన వైద్యులు కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
డెలివరీ సమయంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నట్లు గర్భిణీ బంధువులకూ వివరించారు. ఎదురుకాళ్లు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ చేయడం అనివార్యమని వివరించారు.
కానీ ఆ తర్వాత మిడ్ వైఫరీ నర్సింగ్ ఆఫీసర్ సుజాత సదరు గర్భిణీకి తగు జాగ్రత్తలు సూచిస్తూ, కొన్ని రకాల వ్యాయామాలు చేయించారు. ఆ తర్వాత ఎదురుకాళ్లతో ఉన్నప్పటికీ క్లిష్టమైన డెలివరీని సుఖ ప్రసవం చేసి రికార్డు సృష్టించారు.
Also read: Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావు ఆదేశాలపై.. మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేక స్వాగతం!
ఈ సందర్భంగా డీసీహెచ్ డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో ఇలాంటి సిచ్వేషన్ లో సిజేరియన్ చేస్తారని వెల్లడించారు. భారీ ఖర్చుతో కూడిన డెలివరీ అని, కానీ పాల్వంచ ఏరియా ఆసుపత్రిలో తమ స్టాఫ్ సులువుగా డెలివరీ చేసి తల్లి, బిడ్డలను కాపాడారని కొనియాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని, స్టాఫ్ సమస్య లేకుండా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గతంతో పోల్చితే డెలివరీల సంఖ్య భారీగా పెరిగాయని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా జిల్లా వైద్య యాంత్రాంగం, పాల్వంచ ఏరియా ఆసుపత్రి స్టాఫ్ ను అభినందించారు.