Jupally Krishna Rao( image credit: swetcha reporter)
తెలంగాణ

Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావు ఆదేశాలపై.. మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేక స్వాగతం!

Jupally Krishna Rao: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అతిధులకు విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  సందర్శించారు. స్వాగత సత్కారాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 Also Read: Mulugu Corruption case: ములుగు జడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. అధికారులు పట్టుబడిన రహస్యాలు!

మిస్ వరల్డ్ వేడుకలకు వచ్చే సుందరీమణులు, ప్రతినిధులు, ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్ , పర్యాటక శాఖ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్ఎఫ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయాన్ని మరింత అందంగా ముస్తాబు చేయాలనిన్నారు. పూలు, మామిడి, అరటి తోరణాలతో సుందరంగా అలంకరించాలని ఆదేశించారు.

ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్ ను త్వరగా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వాగత బృందాల సంఖ్యను పెంచాలని సూచించారు. అడుగడుగునా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అన్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్ తో భేటీ అయ్యారు. తెలంగాణలోని వారసత్వ, చారిత్రక కట్టడాలను సందర్శించాలని కోరారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!