India-Pak War
జాతీయం

India And Pak Tension: ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి.. ఈలోపే కీలక పరిణామం

India-Pak Tension: పహాల్గాం ఘటన తర్వాత అటు ఉగ్రమూకలు, ఇటు పదే పదే వంకరబుద్ధి చూపిస్తున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని సువర్ణావకాశం కోసం ఇండియా వేచిచూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు, ఏ క్షణాన యుద్ధం జరుగుతుందో, ఎప్పుడు పాక్‌పై భారత్ భీకర దాడులకు దిగుతుందో అంచనాలకు అందని పరిస్థితి. మరోవైపు మే 09, 10,11 తేదీల్లో పాకిస్థాన్‌‌పై భారత్‌ దాడులు చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు, కీలక భేటీలతో అంచనాలు యుద్ధంపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశ భద్రత స్థితిగతులపై మోదీకి బ్రీఫింగ్‌ ఇచ్చారు. కాగా, 48 గంటల్లో మోదీ-దోవల్‌ ఇలా భేటీ కావడం రెండోసారి. ఈ వరుస భేటీలతో ఏ క్షణం అయినా పాక్‌తో యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఇండియన్ ఆర్మీ సైతం హై అలెర్ట్‌గానే ఉంది. ఈ కీలక భేటీకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ భేటీలో తాజా పరిణామాలతో పాటు మాక్ డ్రిల్‌, పలు కీలక అంశాలపైనే లోతుగా చర్చించినట్లుగా తెలుస్తున్నది.

Ajit Doval Meets Modi
Ajit Doval Meets Modi

Read Also-Mock Drills: కేంద్రం హైఅలర్ట్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. ఏం చేస్తారంటే?

మూడు కేటగిరీలుగా విభజన..
కాగా, పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తించడం జరిగింది. మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాల విభజించారు. కేటగిరీ-1లో ఢిల్లీ, తారాపూర్‌ అణు కేంద్రం, కేటగిరీ-2లో హైదరాబాద్‌, విశాఖపట్నం, 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా హోంశాఖ అంచనా వేస్తోంది. అలాగే బుధవారం భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాక్ డ్రిల్ల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్ష ప్రాంతాలకు ఎలా వెళ్లాలననేది ఈ మాక్ డ్రిల్. దీంతో పట్టణ నగరాల్లో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోయే అవకాశాలున్నాయి. కీలక సంస్థలు, ప్రాజెక్టులు వాటి రక్షణకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సోమవారం మోదీని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కలిసిన సంగతి తెలిసిందే. అంతకు మునుపు వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా ప్రధాని సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

Read Also-AP Tourism: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

దెబ్బ కొట్టాల్సిందే..
పహాల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చే వారిని ఊహకందని రీతిలో శిక్షిస్తామని ఇదివరకే పలుమార్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈ దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకునే సమయం, విధానం, స్వభావాన్ని నిర్ణయించుకోవడానికి ఇండియన్ ఆర్మీకి పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను మోదీ ఇచ్చారు కూడా. ఉగ్రవాదానికి గట్టి దెబ్బ పడాలనే దేశం దృఢ సంకల్పాన్ని పదే పదే ప్రధాని నొక్కి చెబుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. దేశ భద్రతపై ఎప్పటికప్పుడు హోం శాఖ, ముఖ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా, మే-07న బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 244 పౌర రక్షణ జిల్లాలను కలుపుకొని విస్తృతమైన మాక్ డ్రిల్‌ను నిర్వహించబోతున్నాయి. ఈ మాక్‌ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ, నెహ్రూ యువకేంద్రాలు, కాలేజీలు, పాఠశాలల విద్యార్థులను భాగస్వాముల్ని చేయబోతున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు, యువత ఎలా ప్రతిస్పందించాలి? అనేదానిపై హోంశాఖ ఆదేశాలతో ఈ అవగాహన కార్యక్రమం జరగనుంది.

Read Also-Simhachalam Incident : సింహాచలం ఘటనపై సర్కార్ సంచలన నిర్ణయం.. సీఎం తీవ్ర అసంతృప్తి

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు