Pakistan Player To Break Records With Feat
స్పోర్ట్స్

T20: ఫీట్‌తో రికార్డులు బ్రేక్ చేయనున్న పాక్ ఆటగాడు..!

Pakistan Player To Break Records With Feat: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాడు.పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో టీ20 ఏప్రిల్ 20న రావల్పిండి వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ 19 రన్స్ చేస్తే, టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 3వేల రన్స్ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ల రికార్డును కూడా అధిగమించనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో 90 మ్యాచ్‌లలో 78 ఇన్నింగ్స్‌లలో 2,981 రన్స్‌ చేశాడు. టీ20లో 3వేల రన్స్ కంప్లీట్ చేసేందుకు కేవలం 19 పరుగుల దూరంలో ఉన్నాడు.

Also Read: సీఎస్‌కేకి భారీ ఎదురుదెబ్బ, నేరుగా చెన్నై జట్టులోకి..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో రిజ్వాన్ 19 రన్స్ చేస్తే, టీ20లో అత్యంత వేగంగా 3వేల రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.టీ20 ఫార్మాట్‌లో 3వేల రన్స్‌ పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి మొత్తం 81 ఇన్నింగ్స్‌లు పట్టింది. బాబర్ ఆజం విషయంలో కూడా అలాగే జరిగింది. బాబర్‌ 81 ఇన్నింగ్స్‌లు ఆడి T20 ఇంటర్నేషనల్‌లో మూడువేల రన్స్‌ చేశాడు. అయితే రిజ్వాన్ 78 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ