Player Devon Conway Ruled CSK Name Richard Gleeson As Replacement: డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్ ఆటగాడు, సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ మ్యాటర్‌ని సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను భర్తీ చేసింది. రూ.50 లక్షలతో అతన్ని తమ టీమ్‌లోకి తీసుకుంది. కాన్వే దూరమవ్వడం చెన్నైకి భారీ లోటు..
గతేడాది సీఎస్‌కే టైటిల్ గెలవడంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కీ రోల్ పోషించాడు. 2022 ఎడిషన్‌లో చెన్నై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన కాన్వే, ఆ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 42 సగటు, 145.66 స్ట్రైక్ రేట్‌తో 252 రన్స్ చేశాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 672 రన్స్‌తో శుభమాన్ గిల్ (890 రన్స్), ఫాఫ్‌డు ప్లెసిస్ 730 రన్స్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక గ్లీసన్ విషయానికొస్తే ఇతను ఇంగ్లాండ్ రైట్ ఆర్మ్ మీడియం పేసర్. 36 ఏళ్ల గ్లీసన్ ఇంగ్లాండ్ తరపున 6 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
Also Read:రోహిత్‌కి జోడీగా కోహ్లి..
ఇతనికి అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, గ్లీసన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్, బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ వంటి జట్లు తరపున ఆడి పొట్టి ఫార్మాట్‌లో అనుభవం బాగా గడించాడు. కాగా, ఎప్పటిలానే ప్రస్తుత సీజన్‌లో చెన్నై మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పర్వాలేదనిపిస్తున్నాడు. సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 19న జరగనుంది. వీరింకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అందులో నాలుగింట విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవచ్చు.