Vijayawada Crime: విజయవాడలో దారుణం..
Vijayawada Crime (imagecredit:twitter)
క్రైమ్

Vijayawada Crime: విజయవాడలో దారుణం.. డ్రైనేజీలో పడి బాలుడి మృతి!

Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుణదలలో విషాదం జరిగింది. డ్రైనేజీలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. గుణగల గంగిరెడ్డుల దిబ్బలో వుంటున్న మణికంఠ అనే బాలుడు మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడ్డాడు. వర్షాలకు నీరు ఎక్కువగా పారుతుండడంతో ఓ బాలుడు కొట్టకుపోగా మరో బాలుడిని స్థానికులు కాపాడారు. కొట్టుకుపోయిన మణికంఠ మృతదేహం గుణగల సెంటర్‌లో తేలింది. వెంటనే మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

Also Read: Child demonization: పిల్లలపై పెరిగి పోతున్న అరాచకాలు.. కారణం అవేనంటారా!

గతంలో కూడా విజయవాడలో ఇలాంటి సంఘటనే జరిగింది. గురునానక్ కాలనీలో ఓ బాలుడు కాల్వలో పడి కొట్టుకుపోయాడు. అప్పుడు భారీ వర్షానికి గురునానక్ కాలనీలోని కాల్వ ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడ్డాడు. మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా కాలు జారి అందులో పడిపోయాడు. ఆ తర్వాత వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కాల్వలో గాలించారు. కానీ బాలుడు ఎక్కడా కనిపించలేదు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. డ్రైనేజీ మరో బాలుడిని పొట్టన పెట్టుకుంది.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క