Minister Punnam Prabhakar: ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కలను కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్పీ డాక్టర్ పి శబరీష్ లతో కలిసి రూ.4.80 కోట్లతో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పున్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం మేరకే ప్రజా పాలన ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.
ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను కాకుండా నూతన పథకాలను సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ 1989లో నిర్మించగా ప్రస్తుతం బస్టాండ్ పరిస్థితి బాగోలేదని మంత్రి సీతక్క తెలపడంతో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. మంగపేట మండలంలో రూ.50 లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో మంగపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ ను ప్రారంభించడమే కాకుండా ఎటూర్నగరం మండలంలో రూ.7కోట్ల రూపాయలతో చేపట్టనున్న బస్సు డిపో పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Also Read: GHMC Corporators: సమయం లేదు మిత్రమా… సంపాదించాల్సిందే!
జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని ప్రేమనగర్ వద్ద గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, వైద్య కళాశాల లకు అందుబాటులో ఉండే విధంగా నూతన బస్టాండ్ ను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు 600 బస్సులను కేటాయించి ఓనర్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లా మండల ప్రాంతంగా జిల్లాగా ఏర్పడి ఆదివాసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ములుగు జిల్లా అను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గంలోని అందరం పనిచేస్తామన్నారు. ములుగు జిల్లా అను పర్యాటక ప్రాంతంగా మార్చడంతో పాటు ఎలాంటి అభివృద్ధి పనులకైనా వెనకాడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరీమణులు రామప్పను సందర్శించనున్న దృశ్య ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
Also Read: YS Sharmila On Modi: మోదీజీ ఈసారైనా పూర్తి చేస్తారా? రాజధాని పై షర్మిల కీలక వ్యాఖ్యలు..