Hero Nani: హీరో నాని తలకు గాయం.. వైరల్ అవుతున్న ఫోటోలు
Hero Nani ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Hero Nani: హీరో నాని తలకు గాయం.. వైరల్ అవుతున్న ఫోటోలు

Hero Nani: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శైలేష్ కొలను డైరక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 చిత్రం మే 1 న విడుదలయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే, ఈ మూవీ రూ. 82 కోట్లు గ్రాస్ వసూలు చేసి రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. దీనికి సంబందించిన పోస్ట్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిచింది. త్వరలో ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరనుంది. అయితే, ఈ మూవీలో నాని ఇంత వరకు చేయని పాత్ర చేసి .. వైలెంట్ గా కూడా దుమ్ము లేపాడు. కాగా, ఈ చిత్రం కోసం నాని చాలా బాగా కష్టపడ్డాడు.

Also Read:  Allu Arjun: కొత్త లుక్ లో అల్లు అర్జున్ .. ఈ సారి థియేటర్లు తగలపడిపోతాయి.. ఇది మాత్రం పక్కా

అయితే, ఇటీవల శైలేష్ కొలను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” శ్రీనగర్ లో ఒక ఫైట్ సీన్ చేసేటప్పుడు చిన్న ప్రమాదం జరిగింది.
కెమెరా ముందుకు తీసుకెళ్లినప్పుడు నాని తలకు తగిలి పెద్ద గాయమైంది. చీలి రక్తం కారుతున్నా కూడా షూటింగ్ ను మాత్రం ఆపలేదు. ఇంకా ఎన్ని షాట్స్ ఉన్నాయి అని చెప్పు .. చేసేద్దాం అన్నాడు. రక్తం గడ్డ కట్టేలా చేసి షూటింగ్ మొత్తం పూర్తిచేసాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయాన్నే మళ్ళీ శ్రీనగర్ వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నాని డెడికేషన్ అలా ఉంటుంది ఒక ఉదాహరణగా దీని గురించి చెప్పాడు.

Also Read:  DSPFF25: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ అవార్డు ఎవరికంటే?

అయితే, తాజాగా ఆ గాయానికి సంబందించిన ఫోటోలను శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నాని ఓ సీన్ లో కొంతమందిని కొడుతూ ఉండగా.. అప్పుడు, సడెన్ గా కెమెరా నాని తలకు గట్టిగా తగలడంతో రక్తం వచ్చింది. దానికి సంబంధించిన షూట్ విజువల్స్ ని డైరెక్టర్ శైలేష్ కొలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:  Vijay Deverakonda: ఆ మాటకు విజయ్ దేవరకొండపై కేసు నమోదు.. బాగా ఇరుక్కున్నాడు!

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..