Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. ఆయన నార్మల్‌గా పాకిస్తాన్ దాడిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటల్లో.. వాడిన ఓ పదం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ఆ పదం వాడినందుకు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ చౌహాన్ అనే అతను విజయ్ దేవరకొండపై కేసు ఫైల్ చేయించారు. అసలింతకీ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడాడు? అది ఎవరిని నొప్పించింది? కేసు వరకు వెళ్లడానికి కారణాలేంటి? అనే విషయాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Kollywood Star Hero Suriya) నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (Retro Pre Release Event)కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన సూర్య గురించి, సినిమా గురించే కాకుండా, ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై కూడా రియాక్ట్ అయ్యారు. అందులో ఆయన ‘ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవని’ అన్నారు. ఇప్పుడిదే కాంట్రవర్సీగా మారింది. ట్రైబల్స్‌తో పోల్చడంతో గిరిజనులను అవమానించినట్లుగా భావిస్తూ.. ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ తరపున కిషన్ రాజ్ చౌహాన్, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.
Also Read- Jabardasth Tanmay: కిరాక్ ఆర్పీ మోసం చేశాడు.. అందరూ నాలో అవే చూశారు!
అసలు విజయ్ ఈ కార్యక్రమంలో ఏమన్నాడంటే.. ‘‘పాకిస్తాన్‌లో ప్రజలకు కరెంట్, నీళ్లు లేవు.. అవి చూసుకోకుండా, ఇక్కడకు (భారత్) వచ్చి ఏం చేయాలని చూస్తున్నారో నాకర్థం కావడం లేదు. అసలు పాకిస్తాన్‌పై ఇండియా అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి, వాళ్ల గవర్నమెంట్‌పై వాళ్లే అటాక్ చేస్తారు. అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు.. వీళ్లు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్‌సెన్స్ లేకుండా చేసే పనులివి’’ అని ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ అన్నారు.
Also Read- Jani Master: హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ.. పహల్గాం ఘటనపై షాకింగ్ కామెంట్స్
దీనికి గానూ, ‘‘ఏప్రిల్ 26వ తేదీన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాపులర్ యాక్టర్ విజయ్ దేవరకొండ, మరో పాపులర్ యాక్టర్ సూర్య, వేల ప్రజల సమక్షంలో, వారి ఫ్యాన్స్ ముందు ఉపన్యాసం ఇస్తుండగా, ఆ సమయంలో దేశంలో ఉన్న ప్రింటింగ్ మీడియా సమక్షంలో విజయ్ దేవరకొండ గిరిజన జాతిని అవమానిస్తూ.. ‘500 సంవత్సరాల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్లు వాళ్లు బుద్ధిలేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు’ అని అన్నారు. ఈ స్టేట్‌మెంట్ అన్ని మీడియా మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. దయచేసి మా గిరిజన జాతిని అవమానిస్తూ, ఉపన్యాసంలో మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చర్యలు తీసుకోవాలని మా ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ తరపున కోరుతున్నాను’’ అని కిషన్ రాజ్ చౌహాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే, విజయ్ దేవరకొండ బాగా ఇరుక్కున్నట్టే. మరి ఈ కేసు నుంచి ఆయన ఎలా బయటపడతాడో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు