Jani Master: ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో దాదాపు 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని భారత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ దాడి వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్‌కు చెందిన లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత భారత్ సాధ్యమైనంతగా పాకిస్తాన్ నడ్డివిరిచేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ దాడిలో ఏపీకి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే.
సోమిశెట్టి మధుసూదనరావు ఫ్యామిలీని ఇప్పటికే పలువురు ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఫ్యామిలీకి అండగా ఉంటానని తెలుపుతూ, రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ‘‘మనీ ఇలా ప్రకటించడం ఇష్టం లేదు.. ఇది సాయం అని అనడం లేదు, ఇది మా బాధ్యత. ఆ కుటుంబ పెద్ద లేరు. ఆ ఇంటికి ఇప్పుడు ధైర్యాన్నివ్వాలి. వాళ్ల పిల్లల చదువుల కోసమైనా ఇవి ఉపయోగపడతాయి. డబ్బులిచ్చి, చేతులు దులిపేసుకుంటామని అనుకోకండి. ఏ అవసరం వచ్చినా, నాకు కాల్ చేయండి. మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం. కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎప్పుడైనా కాల్ చేయండి’’ అంటూ మధుసూదనరావు కుటుంబంలో పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని నింపారు.
Also Read- Jabardasth Tanmay: కిరాక్ ఆర్పీ మోసం చేశాడు.. అందరూ నాలో అవే చూశారు!
తాజాగా మధుసూదనరావు కుటుంబాన్ని జానీ మాస్టర్ తన భార్యతో సహా వెళ్లి పరామర్శించారు. జానీ మాస్టర్‌తో మధుసూదనరావు ఫ్యామిలీ ఏమని చెప్పారో.. తాజాగా ఆయన ఓ వీడియోలో వెల్లడించారు. ‘‘సరిగ్గా నెల కిందట మా అబ్బాయి మీ అభిమాని అని ఫొటో దిగాడు. అటువంటి అభిమానిని, ఆయన కుటుంబాన్ని ఇలా చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. వారు కూడా మిమ్మల్ని ఇలా కలుస్తున్నందుకు బాధగా ఉందని తెలియజేశారు. మధుసూదన్ తల్లిదండ్రులు, పిల్లలు ధైర్యంగా ఉండాలని కోరాం’’ అని తెలిపారు.
వుయ్ ఆల్ ఆర్ ఇండియన్స్… జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి అలాగే హిందూ,ముస్లిం,క్రిస్టియన్ మిగిలిన అన్ని మతాలు మన జాతీయ జెండా ఎగిరేంత వరకూ కలిసే ఉంటాం… ఆ జెండా ఎప్పటికీ ఎగిరే ఉంటుంది… @PawanKalyan అన్న నువ్వు ఈ కుటుంబానికి చేసిన సహాయం అని అనను అది నీ బాధ్యత.. మీరు ఇస్తానన్న… pic.twitter.com/2d8TKkRenS
— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 (@GunukulaKishore) May 2, 2025
‘‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్న ప్రకటించిన రూ. 50 లక్షల గురించి ఆ కుటుంబం నాతో మాట్లాడారు. ఆ సాయం వారి కుటుంబంలో ఎంతో ధైర్యాన్ని నింపిందని అన్నారు. అది సాయం అని నేను అనడం లేదు. అది అన్న బాధ్యత. కళ్యాణ్ అన్న ఇస్తానన్న యాభై లక్షలు వాళ్ళ కుటుంబంలో చాలా ధైర్యాన్ని నింపిందని నా ద్వారా చెప్పమన్నారు. థ్యాంక్యూ అన్నా’’ అని చెప్పిన జానీ మాస్టర్.. ఉగ్రదాడిపై తనదైన తరహాలో స్పందించారు.
Also Read- Allu Arjun: ‘వేవ్స్ 2025’లో చిరుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఏమంటారో?
ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ‘‘వుయ్ ఆల్ ఆర్ ఇండియన్స్. జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగిలిన అన్ని మతాల వారు మన జాతీయ జెండా ఎగిరేంత వరకూ కలిసే ఉంటాం. ఆ జెండా ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది. భారతీయులందరూ కలిసి మెలిసి ఉన్నారు. భారత్ జోలికి వస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తాడు.. అందులో నేను ముందు ఉంటాను’’ అని తన దేశభక్తిని చాటారు జానీ మాస్టర్.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు