Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 1 , పుష్ప 2 తో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. తగ్గేదే లే అంటూ మొదలు పెట్టి ఎక్కడా తగ్గకుండా పుష్ప 2 తో ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. అయితే, ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత బన్నీ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే, మొన్నటి వరకు ఏ సినిమా చేస్తాడు ? ఏ డైరెక్టర్స్ కి తన డేట్స్ ఇవ్వనున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. తన పుట్టిన రోజు నాడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది.
Also Read: Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
ఇప్పటికే తన కొత్త సినిమాని మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, త్రివిక్రమ్ ఆలస్యం చేయడంతో అల్లు అర్జున్ రూట్ మార్చుకుని కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. అట్లీ తన కథతో సిద్దంగా ఉండటంతో అతనికి డేట్స్ ఇచ్చాడు. బన్నీ, అట్లీ కాంబోలో మూవీ ముందుగా రానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.
Also Read: Sunitha – Pravasthi: సింగర్ ప్రవస్తి, సునీత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ్
అయితే, ఆరేళ్ళ నుంచి బన్నీ మనకి పుష్ప రాజ్‌లాగే కనిపించాడు .. ఏ ఈవెంట్స్ లో నైన గడ్డం, జుట్టుతో కనిపించేవాడు. ఇక ఇప్పుడు బన్నీ అట్లీ కథ కోసం కొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇంతక ముందు రాని లుక్ లో స్టైలీష్‌గా చూపించబోతోన్నాడని తెలుస్తోంది. తన బాడీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తారని అంటున్నారు. తాజాగా, అల్లు అర్జున్ లుక్ కి సంబందించిన ఓ కొత్త ఫోటో తెగ వైరల్ అవుతుంది.
పుష్ప 2 తో అల్లు అర్జున్ రెండు వేల కోట్ల మార్కెట్లోకి వెళ్ళిపోయాడు. తెలుగు వాళ్లకి వెయ్యి కోట్ల మార్కెట్ చిన్నదిగా అయిపోయింది. మరి, ఈ చిత్రంతో బన్నీ ఎన్ని వేల కోట్లు టచ్ చేస్తాడో చూడాలి.