Tollywood Actress: పూజా హెగ్డే ( Pooja Hegde )గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ బుట్టబొమ్మ ఇప్పుడు మాత్రం జాడ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చేసిన కూడా అసలు కలిసి రావడం లేదు. ఎంత కష్టపడుతున్న కూడా ఫలితం రావడం లేదు. ఇప్పటి వరకు 7 సినిమాలు తీసింది కానీ, వాటిలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఇలా వరుసగా 7 ప్లాపులు అందుకున్న ఏకైక హీరోయిన్ గా రికార్డు కియోట్ చేసింది.
Also Read: Janulyri Emotional: వెక్కి వెక్కి ఏడుస్తూ సంచలన వీడియో షేర్ చేసిన డ్యాన్సర్ జాను లిరీ
హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక తెలుగులో అయితే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తమిళం, హిందీ భాషల్లో ఆఫర్స్ వచ్చినా కూడా.. వరుస పరాజయాలు అవుతున్నాయి. స్టార్ హీరో పక్కన నటిస్తున్న కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. వరుసగా ఆరు డిజాస్టర్లతో సతమవుతున్న పూజాకి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది.
Also Read: Allu Arjun: ‘వేవ్స్ 2025’లో చిరుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఏమంటారో?
పూజా హెగ్డే సక్సెస్ చూసి దాదాపు మూడేళ్లు అవుతుంది. 2021 డిసెంబర్ లో అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో హిట్ అందుకుంది.ఆ తర్వాత ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ చిత్రం చేసింది కానీ, డిజాస్టర్ గా మారింది. విజయ్ తో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా అంతంతమాత్రంగా ఉంది. రామ్ చరణ్ కు జోడీగా నటించిన ‘ఆచార్య’ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో కలిసి రాకపోవడంతో హిందీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అక్కడ కూడా కలిసి రాలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు