Janulyri Emotional: డ్యాన్సర్ జాను లిరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను.. తన డాన్స్ తో ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది. దీంతో జాను గురించి ఏ చిన్న వార్త తెలిసిన వెంటనే వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈమె ఏడ్చుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Sunitha – Pravasthi: సింగర్ ప్రవస్తి, సునీత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ్
తాను ఏ పని చేసినా.. ఎవరితో మాట్లాడినా కూడా లింక్స్ పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అదంతా చూసి నా మనస్సు తట్టుకోలేక పోతుంది. ఈ ట్రోలింగ్ చూస్తుంటే నాకు బతకాలని లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక, ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచన లేని రెండో పెళ్లి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారంటూ .. ఎమోషనల్ అయింది.
Also Read: MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్ జెండా స్టిక్కర్.. ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఆమె షేర్ చేసిన వీడియోలో జాను లిరీ మాట్లాడుతూ.. ” మాట్లాడితే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా అంటూ ఇష్టమొచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. మీకు ఇంక ఏ టాపిక్ దొరకలేదా .. నా పర్సనల్ లైఫ్ గురించి రాస్తున్నారు. మీరు అంతగా చెప్పాలనుకుంటే, చేసిన మంచి గురించి చెప్పండి.. ఢీ షోలో విన్నర్ గా నిలిచాను.. ఒక బాబును పెంచుకుంటున్నాను.. ఇంకా అలా చేసింది, ఇలా చేసింది అని ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదంటూ ” కన్నీటి పర్యంతమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు