MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్​ జెండా స్టిక్కర్.
MLA Raja Singh (imagecredit:twitter)
Telangana News

MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్​ జెండా స్టిక్కర్.. ఎమ్మెల్యే​ వినూత్న నిరసన!

తెలంగాణ: MLA Raja Singh: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో చెప్పులు విడిచే చోట పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు అతికించారు. విషయం తెలిసిన మంగళ్​ హాట్​ పోలీసులు అక్కడికి వెళ్లి స్టిక్కర్లను తొలగించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్​ లో మన జాతీయ జెండాలను తగులబెడుతున్నారని పేర్కొన్నారు.

నిజానికి పోలీసులు స్టిక్కర్లు తొలగించినపుడు రాజాసింగ్​ తిరుమలలో ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొండపై జెండా వివాదం మీద స్పందించారు. నా ఆఫీస్​ లోకి వచ్చి వెళ్లేవారు పాకిస్తాన్​ జెండాను తొక్కాలని గడపలో స్టిక్కర్లు అతికించినట్టు చెప్పారు. పోలీసులు వాటిని తొలగించారంటూ కార్యకర్తల ద్వారా తెలిసిందన్నారు.

Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్

దీనిపై పోలీసులతో మాట్లాడగా అది ఓ మతానికి చెందిన జెండా అని చెప్పారన్నారు. పాకిస్తాన్ జెండాకు ఆ మతానికి చెందిన జెండాకు మధ్య ఉండే తేడా గురించి పోలీసులకు అవగాహన లేదన్నారు. ప్రధాని మోదీ ఉగ్రవాదులకు త్వరలోనే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..