Kushendar Ramesh Reddy
ఎంటర్‌టైన్మెంట్

DSPFF25: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ అవార్డు ఎవరికంటే?

DSPFF25: 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమాలను, తెలుగు సినిమా సాంకేతిక నిపుణులను అవార్డులను వరించిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా బెస్ట్ ఫిలింగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ‘రజాకర్’ చిత్రం ఉత్తమ తొలి దర్శకుడు అవార్డునే కాకుండా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ‘రజాకార్’ చిత్రంలో తన విజువల్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డిని ఈ అవార్డు వరించడంతో.. అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే, ఆ సినిమాకు ప్రధానం బలం సినిమాటోగ్రఫీనే. అత్యద్భుతంగా కుశేందర్ రమేష్ రెడ్డి తన పనితనం కనబరిచి ప్రేక్షకుల మన్ననలను సైతం అందుకున్నాడు.

Also Read- Manju Warrier: అభిమానుల ముసుగులో.. మంజూని అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్!

‘రజాకార్’ చిత్రంలో ఆయన ఇచ్చిన విజువల్స్‌‌కు అంతా ఆశ్చర్యపోయారు. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డికి పురస్కారం లభించండం పట్ల, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. కుశేందర్ రమేష్ రెడ్డి విషయానికి వస్తే.. కేకే సెంథిల్ కుమార్ దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాలకు చీప్ అసోసియేట్‌గా పని చేశారు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా అవార్డును సొంతం చేసుకుని, మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకునేలా చేసుకోగలిగాడు.

‘రజాకార్’ చిత్ర విషయానికి వస్తే.. నిజాం రాజు నిరంకుశ పాలనను, రజాకర్ల దౌర్జన్యాల్ని మట్టు పెట్టి, నిజాం రాజ్యాన్ని భారత దేశంలో కలిపిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. హిస్టరీలో దాగి ఉన్న నిజాన్ని, ఎవ్వరికీ తెలియని వీర గాథల్ని యాటా సత్యనారాయణ ‘రజాకార్’ చిత్రంగా తెరపైకి తీసుకువచ్చారు. ఆయన విజన్‌కు తగినట్లుగా, అప్పటి కాలాన్ని కుశేందర్ రమేష్ రెడ్డి తన కెమెరాతో తీసుకొచ్చి, చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాన్ని మలిచాడు. ‘రజాకార్’ టీమ్ అంతా అర్హుడికి అవార్డు వచ్చినట్లుగా భావిస్తూ.. కుశేందర్ రమేష్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు.

Also Read- Sumanth: అఖిల్ కంటే ముందే అక్కినేని ఇంట్లో ఈ హీరో పెళ్లి.. నిజమేనా?

కుశేందర్ రమేష్ రెడ్డి ప్రస్తుతం వానర సెల్యులాయిడ్, డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న ‘బార్బరిక్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ, కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా.. పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ‘12A రైల్వే కాలనీ’ చిత్రానికి పని చేస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు లేకుండా కంటెంట్ వున్న కథలని ఎంచుకుంటూ, ఆ కథలకు అలాగే దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలనేదే తన ధ్యేయమని ఈ సినిమాటోగ్రాఫర్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం