GHMC Employees
హైదరాబాద్

GHMC Employees: ఆరోగ్య బీమాకు గ్రహణం.. ఉద్యోగుల అవస్థలు

GHMC Employees: జీహెచ్ఎంసీ (GHMC)  దాదాపు 34 వేల మంది పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగులు (Employees) విధులు నిర్వహిస్తున్నారు. వారిలో రోజురోజుకి తగ్గిపోతున్న పర్మినెంట్ ఉద్యోగులకు కనీస వసతులు కల్పించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర సర్కారు ఉద్యోగుల మాదిరిగా నివసించేందుకు క్వార్టర్స్ కూడా లేని జీహెచ్ఎంసీ ఉద్యోగులు  ఆరోగ్య బీమా (Health Insurance) కు కూడా దూరమౌతున్నారు. సుమారు నాలుగున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు గత ఫిబ్రవరి మాసంలో ముగిసింది. అప్పటి నుంచి పర్మినెంట్ ఉద్యోగులు ఆరోగ్య భద్రత కార్డులు చెల్లుబాటు కావడం లేదు. దీంతో గుండె తదితర జబ్బుల బారిన పడి కొందరు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్స్‌ను ఆశ్రయించగా, కార్డుల చెల్లుబాటు కాని విషయం బయటపడింది. ఈ విషయం యూనియన్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక చొరవ తీసుకున్న బీఎంఎస్ గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అప్పటి కమిషనర్ ఇలంబర్తిని ఫిబ్రవరిలో కలిసి గడువు ముగిసిందన్న విషయాన్ని వివరించటంతో, సానుకూలంగా స్పందించిన ఆయన యుద్ధ ప్రాతిపదికన హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఏజెన్సీని నియమించేందుకు టెండర్ల ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడంతో ట్రయల్ బ్లేజ్ అనే సంస్థ టెండర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. పాలసీని పునరుద్ధరించేందుకు సమయం పడుతుందని అధికారులు తేల్చి చెప్పడంతో అప్పటికే హాస్పిటల్‌లో చేరిన కొందరు ఉద్యోగులకు స్టంట్స్ వేయాల్సి ఉండగా, వారు ఆ ఆపరేషన్‌ను వాయిదా వేసుకుని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also- GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువే!

పరిపాలనాపరమైన మంజూరీ కోసం

జీహెచ్ఎంసీలోని సుమారు నాhttps://swetchadaily.com/warangal/mahabubnagar-district-farmers-worried-about-bn-gupta-tularam-dam-developmentలుగున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు, వారి నుంచి ఎలాంటి ఫీజు స్వీకరించకుండా, పైసా భారం పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు సదరు ఏజెన్సీ లెక్కలు వేసింది. మొత్తం ఉద్యోగులకు వార్షిక ప్రీమియంగా జీహెచ్ఎంసీ రూ.6 కోట్ల 91 లక్షల 17 వేల 121 చెల్లించాలని నిర్ణయించింది. రూ.5 కోట్లు దాటినందున సర్కారు నుంచి పరిపాలనాపరమైన అనుమతిని తీసుకోవాలన్న నిబంధన ఉండడం, పైగా జీహెచ్ఎంసీ కొద్ది నెలల క్రితం మంజూరు చేసిన రూ.3వేల 30 కోట్ల నుంచి ఆ డబ్బును సదరు ఇన్సూరెన్స్ ఏజెన్సీకి చెల్లించేందుకు ట్రెజరీకి చెక్కును పంపగా, సుమారు నెలన్నర రోజుల నుంచి ప్రతిపాదన అక్కడే పెండింగ్‌లో ఉంది. సర్కారు నిధులను మంజూరు చేయకపొవడంతో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు ఆగిపోయింది. ఈమధ్య ఇలంబర్తి స్థానంలో ఆర్‌వీ కర్ణన్ కమిషనర్‌గా వచ్చారు. ఈ విషయాన్ని యూనియన్ నేతలు కొత్త కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, సదరు ట్రయల్ బ్లేజ్ కంపెనీకి సంబంధించిన గత అయిదేళ్లు అందించిన సేవల నివేదికను సమర్పించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.

రూ.3 లక్షల లిమిట్ దాటితే..

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కొత్తగా చేయనున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఎమర్జెన్సీ సమయంలో రూ.3 లక్షల వరకు వైద్య సేవలందించనున్నట్లు లిమిట్‌ను ఫిక్స్ చేశారు. కానీ రూ.3 లక్షలు దాటి ఖర్చయితే ఎలా అని సదరు ఏజెన్సీని అధికారులు ప్రశ్నించగా, బఫర్ కోటా కింద మరో రూ.3 లక్షల వైద్య సేవలకు మంజూరీ పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కానీ, యూనియన్ల తరపున ఈ లిమిట్‌ను రూ.15 లక్షలకు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Read Also- Miss World Contestants: మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ.. సీఎం మాస్టర్ ప్లాన్ ఇదే!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?