GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. ఈ ఏడాది ఎక్కువే!
GHMC Revenue (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువే!

GHMC Revenue: వర్తమాన ఆర్థిక సంవత్సరం (225-26)కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు అయిదు శాతం రాయితీ కల్పిస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీమ్ తో జీహెచ్ఎంసీకి రూ.900.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం మొదటి మాసమైన ఏప్రిల్ నెల 1 నుంచి నెలాఖరు వరకు అమలు చేసిన ఈ స్కీమ్ గత ఆర్థిక సంవత్సరం (202425) ఏప్రిల్ మాసంలో రూ.831.23 కోట్లు వసూలు కాగా, ఈ సారి రూ.170 కోట్లను పెంచి టార్గెట్ రూ. వెయ్యి కోట్లుగా నిర్ణయించారు.

కానీ పెట్టుకున్న లక్ష్యానికి ఈ సారి 90 శాతం వరకు జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవ‌త్స‌రం పెద్ద మొత్తంలో ఆస్తిప‌న్ను చెల్లించే సంస్థ‌లు, కార్యాల‌యాలు, బకాయిదారులు ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ పథకాన్ని 7 లక్షల 93 వేల 552 మంది బకాయిదారులు వినియోగించుకున్నట్లు తెలిపారు.

Also Read: Dost Registration 2025: గుడ్ న్యూస్.. నేటి నుంచే అప్లికేషన్స్.. ఇలా అప్లై చేయండి!

ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కంపై డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌పై నిరంత‌ర స‌మీక్ష‌,టెలీకాన్ఫ్‌రెన్స్‌లు, వివిధ ప్ర‌చార సాధ‌నాల్లో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించ‌డం వ‌ల్లే గ‌త సంవ‌త్స‌రం క‌న్నా అధిక‌ మొత్తంలో ప‌న్ను వసూలైనట్లు తెలిపారు. జీహెచ్ఎంసి ఉన్న‌తాధికారులు, జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు అన్ని విభాగాల క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది స‌మిష్టి కృషి వ‌ల్లే గత సంవత్సరాన్ని మించి ఆస్తిపన్ను వ‌సూలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎర్లీబ‌ర్డ్ వ‌సూళ్లు వివరాలు

ఆర్థిక సంవత్సరం 2023-24 రూ. 785.94,  2024-25 రూ. 831.23,2025-26 రూ. 900.93 గా వసూలయ్యాయి.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!