Anchor Anasuya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anchor Anasuya: తేజస్విని చూసి ఏడ్చేసిన అనసూయ.. అసలు ఏం జరిగిందంటే?

Anchor Anasuya: మహేష్ బాబు హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు రెండు చేతుల నుంచి సంపాదిస్తుంది. ఒక వైపు సినిమాలు ఇంకో వైపు టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. తేజస్వి ఆమె అభిమానుల కోసం ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Also Read:  Amaravati Relaunch: బెంగళూరుకు జంప్.. అమరావతి సభకు జగన్ డుమ్మా.. కారణాలు ఇవేనా!

ప్రస్తుతం, తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ రాబోతుండగా దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. దీనిలో తేజస్వి మదివాడ రోహిత్ భరద్వాజ్ అనే కొత్త వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతను నా ఫ్యామిలీ అంటూ చెబుతూ చాలా ఎమోషనల్ అయింది.

Also Read:  Deputy CM Pawan Kalyan: అమరావతి సభలో పవన్ కీలక హామీ..హోరెత్తిన సభ.. ఏమన్నారంటే?

తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ” మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న అస్సలు పట్టించుకోలేదు..పూర్తిగా వదిలేశాడు. దాంతో.. నేను ఏం చేయాలో తెలియక 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాను. ఇక అప్పటి నుంచి ఈ రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీనే నన్ను మంచిగా చూసుకుంటుంది. వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అలాగే, లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతా అన్నారని నవ్వుతూ చెప్పింది.నా ఫ్యామిలీ అంటే వీళ్ళే.. అని చెబుతూ ఏడ్చింది. నేను ఎప్పుడూ జనాల్లోనే ఉండాలనుకుంటా.. నేను సింగిల్ గా ఉంటే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వచ్చి చాలా బాధ పడతాను. నేను షూటింగ్ సెట్ కి వచ్చి అక్కడ జనాలని చూస్తే నాకు పండగ వాతావరణం కనిపిస్తుందని ” అంటూ ఏడ్చేసింది.

Also Read: Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

తేజస్వి ని ఆ షోలో జడ్జిగా ఉన్న అనసూయ కూడా ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజస్వి వెనక ఇంత బాధ ఉందా అని నెటిజన్స్ కూడా కూడా షాక్ అవుతున్నారు. దీంతో, ఇప్పుడు దీనికి సంబందించిన ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!