GHMC Standing Committee (imagecredit:swetcha)
హైదరాబాద్

GHMC Standing Committee: టెండర్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం మస్ట్!.. ఆ అంశాలు కీలకం?

GHMC Standing Committee: జీహెచ్ఎంసీ మహానగరంలో చేపట్టే అభివృద్ది, సేవల నిర్వహణతో పాటు పరిపాలనపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జోనల్, సర్కిల్ స్థాయిల్లో వివిధ రకాల అభివృద్ది, మెయింటనెన్స్ పనులకు సంబంధించి అంఛన వ్యయాన్ని బట్టి సర్కిల్, జోన్ల స్థాయిలో టెండర్లను ఆమోదించుకునే ప్రక్రియకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చెక్ పెట్టింది.

కొత్త అభివృద్ది పనులైనా, మెయింటనెన్స్ పనులైనా అంచనా వ్యయం ఎంత ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన తర్వాతే తదుపరి చర్యలకు వెళ్లాలని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. దీంతో పాటు పలు చోట్ల బాక్స్ డ్రెయిన్ల నిర్మాణానికి, మరి కొన్ని చోట్ల రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు పలు ఆస్తుల నుంచి స్థల సేకరణకు కూడా లైన్ క్లియర్ చేస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

దీంతో పాటు మరి కొన్ని పార్కులు, జంక్షన్లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ది చేసుకునేందుకు ఆయా ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు జోనల్ కమిషనర్లకు అనుమతిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అజెండాలొని తొమ్మిది ప్రతిపాదనలతో పాటు రెండు టేబుల్ ఐటమ్స్ గా తీసుకుని మొత్తం 11 అంశాలకు స్టాండింగ్ కమిటీ మంజూరీ ఇచ్చింది.

Also Read: Jangaon district: ఉపాధి కూలీ పనుల తవ్వకాల్లో పురాతన శిల్పం లభ్యం.. ఎక్కడంటే!

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 9 అంశాలను అజెండాలో తీసుకుని ప్రతిపాదించగా, మరో రెండింటిని టేబుల్ ఐటమ్స్ గా తీసుకుని ఆమోదించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, భానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాతా జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సి.ఎన్.రెడ్డి, ఎం.డి బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప తో పాటు వివిధ విభాగాల అదనపు కమిషనర్, విభాగాధిపతులు పాల్గొన్నారు. బల్దియాకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికంగా నిధులు ఇచ్చినందుకు కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.

పవర్స్ కట్

సమావేశమైన స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం అభివృద్ది, మెయింటనెన్స్ పనులకు సంబంధించి ఇదివరకు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఉన్న పవర్స్ కట్ కానున్నాయి. ఇప్పటి వరకు జోనల్ కమిషనర్ కు రూ.2 కోట్ల అంచనా వ్యయం వరకు, అదనపు కమిషనర్లకు రూ.5 కోట్ల వరకు అంఛన వ్యయమున్న ప్రతిపాదనలకు ఆమోదించే పవర్ ఉండగా, ఇపుడు ఆ పవర్స్ కట్ కావటంతో పాటు ప్రతి పనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి కానుంది.

2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి, మేయర్ సీటును కైవసం చేసుకున్న తర్వాత అప్పటి వరకు కార్పొరేటర్లకు ఉన్న రూ.కోటి వార్షిక బడ్జెట్ ను కట్ చేయటంతో, అభివృద్ది, మెయింటనెన్స్ పనులకు బ్రేక్ పడకుండా ప్రత్యామ్నాయంగా జోనల్, అదనపు కమిషనర్లకు అంఛనావ్యయాలను బట్టి మంజూరీ ఇచ్చే పవర్ అప్పగించారు.

ఇపుడు స్టాండింగ్ కమిటీ తాజాగ తీసుకున్న నిర్ణయంతో కార్పొరేటర్లకు ఫండ్ లేదు. అధికారులకు మంజూరీ పవర్ లేదు. అధికార వికేంద్రీకరణ చేస్తున్నామంటూ చెప్పుకుంటూనే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మళ్లీ అధికారాన్ని స్టాండింగ్ కమిటీకే కేంద్రీకరణ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

నాటి స్టాండింగ్ కమిటీలో పని ఏదైనా టెండర్ల ప్రక్రియకు స్టాండింగ్ కమిటీ ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, మేయర్ జోక్యం చేసుకుని స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ అని వ్యాఖ్యానించారు. ఉన్న నిధులను పొదుపుగా ఖర్చు చేసుకోవటంతో పాటు జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలన్నారు.

అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆయా విభాగాలకు సంబంధించిన  టెండర్లు తదితర నిర్ణయ లన్నింటిని స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. కమిటీ ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కూడా ఆమె అధికారులకు క్లారిటీ ఇచ్చారు.

Also Read: Caste Census Survey: కులగణనపై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్ ఎందుకు?

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?