CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ ఉన్నారని పరిశ్రమల స్థాపించేందుకు నారంపేట ఎంతో అనుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మేడే, అంటే కార్మికులు, కష్టజీవులు గుర్తుకొస్తారన్నారు. ఇందులో వ్యవసాయం పై ఆధార పడిన వారే అధికంగా ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని, భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుల కోసం చక్రాన్ని పెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నాం అని సీఎం తెలిపారు.
కేంద్ర, రాష్ట్రాలలోని ఎన్.డి.ఏ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయని, గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల సులభంగా ఇసుక దొరుకుతోంది.. నిర్మాణ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం, నాలా చట్టాన్ని కూడా రద్దు చేశాం. భవనాల నిర్మాణ అనుమతులలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు.. శ్రీ సిటీ.. కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నాం అని అన్నారు. ఎం.ఎస్.ఎం.ఈ. పార్కులలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పరిశ్రమలకు అవసరమైన భూముల సమీకరణకు రైతులు సహకరిస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతికి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడంతో ప్రభుత్వ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో భూములు ఇచ్చినవారికి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తున్నాం దీనివల్ల వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఎన్నో విద్యా సంస్థలకు భూములు ఇచ్చాం. నేను చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి ఏ రైతుకూ అన్యాయం చేయలేదు. అభివృద్ధిని సహించలేని కొందరు.. ఇబ్బందులు పెడుతున్నారని, నెల్లూరు జిల్లాలో తరతరాలుగా వెనుకబడిన యానాది కుటుంబాలను అభివృద్ధి చేస్తామన్నారు.
Also read: YS Sharmila On Modi: మోదీజీ ఈసారైనా పూర్తి చేస్తారా? రాజధాని పై షర్మిల కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో చిన్న.. మధ్య తరహా పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేసి వాటిలో పరిశ్రమలను తీసుకువస్తే వ్యవసాయం తర్వాత పారిశ్రామిక రంగంలో కూడా ఉపాధి అధికంగా లభిస్తుంది. ఈ పార్కులలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. గతంలో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చాను.. దానివల్ల ఎందరికో ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం ఏ.ఐ. వచ్చింది కాబట్టి భవిష్యత్తు కూడా దీనికే ఉంటుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ కింద అమరావతిలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.
అదేవిధంగా విశాఖ రాజమండ్రి విజయవాడ.. తిరుపతి అనంతపురంలలో రీజనల్ హబ్ లను ఏర్పాటు చేసి విద్యాసంస్థలను, పరిశ్రమలను అనుసంధానం చేయడంవల్ల ఎందరికో ఉపాధి వస్తుందని తెలిపారు. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలని విదేశాల్లో తెలుగువాళ్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా దానిని సాధించేందుకు అండగా ఉంటాం అన్నారు. సింగల్ విండో కింద సబ్సిడీ రుణాలు ఇస్తాం అన్నారు. పారిశ్రామిక రంగంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టడంతో పరిశ్రమల్లో ఉత్పత్తుల మార్కెటింగ్ కు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
పారిశ్రామిక పార్కులలో పరిశ్రమలను తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదేన్నారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, పారిశ్రామికవేత్తలను ఎవరూ బెదిరించకుండా చూసుకోవాలన్నారు. ఒక్కో పార్కు కు రూ.10 నుంచి 15 కోట్ల మేర నిధులు ఇస్తామని వీటితోపాటు ఐదు నుంచి పది ఎకరాలలో నానో పార్కులను కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు. రైతులు కూడా పారిశ్రామికవేత్తలుగా మారాలని అదే మా లక్ష్యం అని అన్నారు. మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయాన్ని ఆర్జించాలలని మహిళలను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం అని తెలిపారు.
రాష్ట్ర రాజధాని ఏదంటే ప్రజలు.. మా అమరావతి అనే చెప్పుకోవాలని, రామయ్య పట్నం పోర్ట్ వద్ద పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. దగదర్తి లో విమానాశ్రయ పనులను త్వరలోనే ప్రారంభించి రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామన్నారు. ఇలా రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేదే నా ఆలోచన అని సీఎం మనసులో మాట తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గానిక సోమశిల నీటిని ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని, తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసింది అందువల్లే నెల్లూరులో పది స్థానాల్లోనూ టిడిపిని గెలిపించారు.
Also read: Janasena Peethala Murthy: సింహాచలం విషాదం..తప్పంతా వైసీపీదే!.. జనసేన నేత!
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆత్మకూరులో పెడతామని, అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలని పెన్షన్లను కూడా పెంచామన్నారు. విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను కూడా పెంచిన పార్టీ టీ.డీ.పి.నే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని పింఛన్లను మన రాష్ట్రం ఇస్తోంది ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ పెడుతున్నాం దీపం ..2 పథకం కింద మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నాం వేట విరామ సమయంలో మత్సకారులకు ఆర్థిక సాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నాం.
రైతులకు మూడు విడతల్లో సాయం అందిస్తాం. పాఠశాలలు మొదలయ్యే లోగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి పిల్లలందరికీ.. అమ్మకు వందనం కింద ఏటా రూ.15 వేలను ఇస్తామని తెలిపారు. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా ఎన్నో పనులను చేసామని హైదరాబాదులో విమానాశ్రయం కూడా అదే విధంగా నిర్మించాం దానితో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది అన్నారు. గ్రామాల్లోని పేద ప్రజలకు అండగా ఉండాలని సంపన్నులను కోరుతున్నాం. గతంలో జన్మభూమి కార్యక్రమం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయి అందువల్లే P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. ఇప్పుడిప్పుడే ఇది మంచి ఫలితాలను ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.