YS Sharmila On Modi(image credit:X)
అమరావతి

YS Sharmila On Modi: మోదీజీ ఈసారైనా పూర్తి చేస్తారా? రాజధాని పై షర్మిల కీలక వ్యాఖ్యలు..

YS Sharmila On Modi: ప్రధాని మోడీ అమరావతి టూర్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల సెటైర్లు వేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయలేదని, మట్టి తెచ్చి నోట్లో కొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చారో ఆత్మపరిశీలన చేసుకుని, విభజన హామీల్లో భాగంగా రాజధాని కట్టించాలని అన్నారు.

పదేండ్ల క్రితం రాజధాని శంకుస్థాపన చేసి మళ్లీ ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామన్నారు. ఈ మట్టిని చూసైనా పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలి అని విమర్శలు గుప్పించారు. ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్లీ మట్టేనా? అంటూ Xలో పోస్ట్ చేశారు.

Also read: Pahalgam terrorist attack: తీవ్ర ఉద్రిక్తత వేళ.. అమెరికా నుంచి భారత్‌కు ఫోన్

పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా మోసం చేశారని విభజన హామీల ప్రకారం ఏపీ రాజధానికి వచ్చే మూడేళ్లలో 1.50 లక్షల కోట్లను ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

అమరావతి పునఃప్రారంభం

ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల కోట్లకు పైగా ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని సభకు భారీ సంఖ్యలో జన సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా అమరావతి చుట్టు ప్రక్కల జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే సూచనలు ఉండటంతో 6,600 బస్సులను ప్రభుత్వం కేటాయించింది.

మొత్తమ్మీద 5 లక్షలకు పైగా జనాలను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎటువంటి లోటు రాకుండా ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎమర్జెన్సీ సేవలను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.

 

 

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ