Gold Rate Today: గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న బంగారం ధరలు.. గత రెండ్రోజులుగా శాంతించినట్లు కనిపిస్తున్నాయి. బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ రేట్స్ కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. ఏకంగా రూ.2,000 తగ్గి రూ.87,750కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.2,180 మేర తగ్గి రూ.95,730 చేరింది. కిలో వెండి ధర రూ. 1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad) , విజయవాడ (Vijayawada) తదితర నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 87,750
విజయవాడ ( Vijayawada) – రూ. 87,750
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 87,750
వరంగల్ ( warangal ) – రూ. 87,750
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ (Hyderabad ) – రూ.95,730
విజయవాడ (Vijayawada) – రూ.95,730
విశాఖపట్టణం (visakhapatnam ) – రూ.95,730
వరంగల్ (warangal ) – రూ.95,730
వెండి ధరలు
గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు పెరుగుతూ వచ్చిన వెండి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.2000 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 98,000 కు దిగిపోయింది. ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీ – రూ. 98,000
హైదరాబాద్ – రూ. 1,07,000
విజయవాడ – రూ. 1,07,000
విశాఖపట్టణం – రూ. 1,07,000
వరంగల్ – రూ. 1,07,000