Kare Dharasingh(image credit:X)
నార్త్ తెలంగాణ

Kare Dharasingh: డబుల్ బెడ్ రూమ్‌ల పేరుతో బీఆర్‌ఎస్ నేత దోపిడి.. ఏకంగా రూ.1.65 కోట్ల వసూలు!

Kare Dharasingh: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణమైన డబల్ బెడ్ రూములు ఇప్పిస్తామని చిన్నగూడూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కరె ధారాసింగ్ 80 మంది లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తిస్థాయిలో అయిపోయినప్పటికీ సదరు మండల ప్రధాన కార్యదర్శి కావాలని లబ్ధిదారులకు అప్పగించకుండా ఆలస్యం చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులకు సాకుగా చూపి జాప్యం చేశారు. అప్పటి ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన ధారాసింగ్ ఆయనకు తోచిందే చేస్తూ మండల కేంద్రంలోని ప్రజలను మోసగిస్తూనే వచ్చాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. 80 మంది లబ్ధిదారుల నుండి దాదాపు రూ.ఒక కోటి 65 లక్షలు వసూలు చేసినట్లు కూడా గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఈనెల 23వ తేదీన డబుల్ బెడ్ రూములు మాకు అప్పగించాలంటూ మండల ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, అందులో భాగస్వామ్యమైన మరో వ్యక్తి గంగాధర అనిల్ లను గ్రామస్తులు నిలదీశారు. దీంతో గంగాధర అనిల్ డబ్బులు ఇచ్చిన గ్రామస్తులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లాలని ఉసిగొల్పినట్లు అధికారులు గుర్తించారు.

Also read: CM Revanth Reddy: దేనికైనా రెడీ.. కేసీఆర్ కు సీఎం రేవంత్ మాస్ ఛాలెంజ్!

ఈ క్రమంలోనే చిన్న గూడూరు మండల కేంద్రంలో ఈ నెల 23న పెద్ద గందరగోళమే చోటుచేసుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులు జరిగిన ఘటనకు గల వివరాలను సేకరించి అందుకు బాధ్యుడైన అనిల్ పై స్థానిక ఎమ్మార్వో మహబూబ్ అలీ ఫిర్యాదు మేరకు అతన్ని రిమాండ్ కు తరలించారు.

తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని గ్రామస్తులను మోసగించి డబ్బులు తీసుకున్న ప్రధాన వ్యక్తి బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ధారా సింగ్ పై నూర్జ మూసిన్ బేగ్ గత నెల 28న ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ధారా సింగ్ ను సైతం పోలీసులు రిమాండ్ కు తరలించారు.

సెటిల్మెంట్ చేస్తామని మరో నలుగురు వ్యక్తులు రంగ ప్రవేశం

చిన్నగూడూరు మండల కేంద్రంలో అవకతవకలకు గురైన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులకు డబ్బులు తీసుకున్న బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నుంచి డబ్బులు ఇప్పిస్తామని పత్రికా రంగానికి చెందిన నలుగురు వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు. సెటిల్మెంట్ జరగాలంటే బాధితులు ఒక్కొక్కరు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే రెండు లక్షల చొప్పున సమర్పించుకున్న లబ్ధిదారులు 10000 ఇస్తే తమ సమస్య తీరిపోతుంది డబుల్ బెడ్ రూమ్ తమకు దక్కుతుందనే ఆలోచనతో ఆ నలుగురు వ్యక్తులకు పదివేల రూపాయలను అప్పగించారు. ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులు తోపాటు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ధారాసింగ్ కుమ్మక్కయ్యారు. ఇదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యం

చిన్న గూడూరు మండల కేంద్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తిచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఉందని ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ సాకు చూపించాడు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో దారాసింగ్ లబ్ధిదారులకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వస్తున్నాడు.

డబ్బులు వసూలు చేసిన వ్యక్తి కావాలని లేటు చేశాడని ఆరోపణలు

చిన్నగూడూరు మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తి దారా సింగ్ కావాలనే లేటు చేశాడని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అడిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగించకపోవడం, డబ్బులు సైతం తిరిగి ఇవ్వకపోవడంతో గత నెల 23వ తేదీన ధారాసింగును నిలదీశారు. దీంతో ధారాసింగ్, పదివేల రూపాయలు వసూలు చేసిన నలుగురు వ్యక్తుల్లోని గంగాధర అనిల్ లబ్ధిదారులను ఉసిగొల్పి తాళం వేసి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి ప్రవేశించాలని సూచించారు.

Also read: Anganwadi Holidays: అంగ‌న్వాడీలకు వేసవి సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయంలో ఇళ్లలోకి ప్రవేశించిన వారికి గ్రామస్తులకు తీవ్ర వాగ్వివాదాలు కొనసాగాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి సమస్యను సద్దుమణిగేలా చేశారు.

లబ్ధిదారులు ఇళ్లలోకి ప్రవేశించే లా ఉసిగొలిపిన గంగాధర అనిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అదేవిధంగా లబ్ధిదారుల కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అప్పగిస్తామని డబ్బులు తీసుకున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ పై గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ధారాసింగ్ ను సైతం పోలీసులు రిమాండ్ కు తరలించారు.

మరో ముగ్గురిపై కొనసాగుతున్న విచారణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని డబ్బులు నొక్కేసిన ధారాసింగ్ నుంచి ఇండ్లను ఇప్పించేందుకు ఒక్కో లబ్ధిదారు పదివేల రూపాయలు ఇవ్వాలని నలుగురు డిమాండ్ చేశారు. ఈ మేరకు డబ్బులు ఇచ్చుకున్న గ్రామస్తులు తమకు ఎలాగైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చే విధంగా కృషి చేయాలని ఆ నలుగురు వ్యక్తులకు పదివేల రూపాయల చొప్పున 80 మంది లబ్ధిదారులు డబ్బులు అందజేశారు.

పదివేల రూపాయలు ఇచ్చిన కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు పలుమార్లు అటు ధారాసింగును ఇటు పదివేల రూపాయలు తీసుకున్న నలుగురు వ్యక్తులను నిలదీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 23న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఘర్షణ వాతావరణ చోటు చేసుకోగా, ఆ ఘర్షణకు కారణమైన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

తాజాగా గత నెల 29వ తారీఖున ధారాసింగ్ ను సైతం పోలీసులు రిమాండ్ కు తరలించారు. పదివేల రూపాయలు తీసుకున్న మరో ముగ్గురు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు విచారణ సాగిస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు