హైదరాబాద్: Miss World 2025: రాజధాని మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది. మే 10 తేదిన ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ – 2025 పోటీలకు సంబంధించి ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. దీనిలో బాగంగానే మిస్ వరల్డ్ 2025 పనుల్లో వేగం పెచేందుకు హైదరాబాద్ చార్మినార్, లాల్ బజార్ పరిసర ప్రాంతాలను GHMC కమిషనర్ R.V. కర్ణన్, మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌కు సంబంధించి నగరంలో బ్యూటి ఫికేషన్ పనులను పరిశీలించి చారు.
కమిషనర్ అన్నీ చారిత్రక ప్రదేశాలన్నింటినీ ముస్తాబు చేయాలని జోనల్ కమిషనర్‌ను కర్ణన్ ఆదేశించారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వస్తున్న అందాల రాణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఓ సమావేశంలో సూచించిన విషయం తెలిసందే.
Also Read: RTC Strike: మే 7 నుంచి ఆర్టీసీ సమ్మె.. జేఏసీ నిర్ణయం!
అయితే విమానాశ్రయం దగ్గర నుంచి హోటళ్ల వరకు, కార్యక్రమాలు జరిగే వేదికల వద్ద సెక్యూరిటీ, హాస్పిటాలిటీ పరంగా ప్రమాణాల ప్రకారం ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేవే దిశగా పనులు స్పీడు పెంచాలని అధికారులు, జోనల్ కమీషనర్ కర్ణన్ వివిధ పనులను పరీక్షించారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/