Kamareddy Crime (imagecredit:swetcha)
క్రైమ్

Kamareddy Crime: భార్య భారీ స్కెచ్!.. భర్త జస్ట్ మిస్.. చివరికి ఏమైందంటే!

కామారెడ్డి: Kamareddy Crime: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్దం అయిన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్, రేణుకలు భార్య భర్తలు సాడం కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.

సాడం రేణుక కు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త కుమార్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక, మహేష్ లు భర్త కుమార్ ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. కుమార్ మరణించిన తర్వాత అతని ఆస్తిని అనుభవించాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Also Read: Hebha Patel: అది లేకపోతే బతకలేను.. నైట్ ను బాగా ఎంజాయ్ చేస్తా.. హెబ్బా పటేల్ కామెంట్స్

ఈ కుట్రను అమలు పరచడానికి అల్వాల్ కు చెందిన మహమ్మద్ అశ్వక్ కు 15 లక్షల సుపారి ఇస్తామని ఒప్పించారు. అడ్వాన్స్ గా మహ్మద్ అశ్వక్ తో పాటు ముబిన్, ఆమీర్, అన్వర్, మోసిన్లకు రూ.2 లక్షలు ఇచ్చారు. పథకం ప్రకారం, కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి, మాచారెడ్డి మండలం పరిధిలోని ఫరీద్ పెట్ గ్రామ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు.

ఈ నెల 21 న ఉదయం కాంపల్లి మహేష్, అశ్వాక్, ముబిన్, ఆమీర్, అన్వర్, మోసీన్ లు కలిసి కుమార్ ను ఫరీద్ పెట్ వద్ద వెంబడించి, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాల కారణంగా కుమార్ రక్తపు మడుగులో పడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తు, అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తుల కంటపడటంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించి విచారించగా భార్య రేణుకనే కుమారును హత్య చేయించేందుకు పథకం వేసుకున్నట్లు ఒప్పుకుంది. అలాగే రేణుక తో పాటు కాంపల్లి మహేష్, అశ్వాక్, ముబిన్, ఆమీర్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, గొడ్డలి, 2 బైక్ లు, 4 సెల్ ఫొన్ లు స్వాదీనం చేసుకున్నారు.

Also Read: Shamirpet SI Bribe: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై!

Just In

01

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్

Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏం జరిగిందంటే ?

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!