Dubai Is Roaring With Rains, Roads Facing Rivers
అంతర్జాతీయం

Dubai Rain Effects: దుబాయ్‌ని ముంచెత్తిన వర్షాలు, నదులను తలపిస్తున్న రోడ్లు

Dubai Is Roaring With Rains, Roads Facing Rivers: చుక్కనీరు దొరకని ఎడారి దేశమైన యూఏఈలో అనూహ్యంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల దాటికి దుబాయ్‌ నగరంలోని రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దుబాయ్‌లో కురిసే ఏడాది సగటు వర్షపాతం 120 మిల్లీ మీటర్లు కాగా..తాజాగా దుబాయ్‌లో కేవలం ఆరు గంటల్లోనే 50 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా ఒకింత సంతోషం వ్యక్తం చేస్తూ మరింత భయాందోళనకు గురవుతున్నారు.

దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతుండటంతో.. ఈ భారీ వర్షాల కారణంగా.. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. మరోపక్క..ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు అక్కడి అధికారులు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. దీంతో బిక్కు బిక్కుమంటూ అక్కడి ప్రజలు గడుపుతున్నారు. ఇళ్లలో నుంచి ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Read More: ఎర్రసముద్రంలో కార్గోనౌకపై హౌతీల దాడి.. ముగ్గురు సిబ్బంది మృతి

భారీ వర్షాలతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

ఇళ్లలో నుంచి ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిలోని కొన్ని కాంప్లికేటెడ్‌గా ఉన్న మార్గాలను దుబాయ్ అధికారులు ఇప్పటికే మూసివేశారు. దుబాయ్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగిన దృశ్యాలకు సంబంధించిన దృశ్యాలన్ని నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కొన్ని వాహనాలు అయితే నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?