Rangreddy district: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన పులచింతల జీవన్ అనే వ్యక్తికి తన తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. అయితే ఆ భూమిని 20 సంవత్సరాల కిందట తన తండ్రి నుంచి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసుకొని సాగుచేసుకుంటున్నారు.
అయితే ఆ భూమికి కొత్త మరియు పాత పాస్ బుక్ టైటిల్ ఉన్న, పహనీ పత్రాలు అన్నీఉన్న గతంలో అధికారుల తప్పు వల్ల సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్యే నంబర్ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.
అయితే తనకు న్యాయం చేసి తమ భూమిని నిషేధిత జాబితా నుండి తోలగించి మా భూమి మాకు అప్పగించాలని యువకుడు కోరాడు. దీనికి నిరసనగా ఆ యువకుడు తన భూమిలో వున్నటువంటి చెట్టుకు భూమి పత్రాలను కట్టి అతను తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తంచేశాడు.
Also Read: Tirumala Updates: మీరు సామాన్య భక్తులా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే