నల్గొండ: Congress MLAs: నల్గొండ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణంలో అదనపు భవనాల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో పాటు మా బ్రతుకులు బాగుపడతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగిలిందని, టిఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయగా అభివృద్ధి కుంటుబడిందని అన్నారు.
మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులని, గత 10 ఏళ్లలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగనీయకుండా వందల కోట్ల అవినీతి సొమ్ముతో బస్సుల్లో ప్రజలను తీసుకపోయి మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాను!
మేము చేసి చూపిస్తాం మాకు ఇంకా సమయం ఉందని ఎమ్ముల్యే రాజగొపాల్ రెడ్డి అన్నారు. ఆగం చేసిన తెలంగాణను గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఉత్తంకుమార్ రెడ్డి నాయకత్వంలో మనందరం కలిసి అభివృద్ధి పథంలో ముందుకు నడుద్దాం అని ఎమ్మెల్యే అన్నారు.
ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకులు మన జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల బ్రాహ్మణ వెల్లేముల కు మరియు మునుగోడు కు నీళ్లు వచ్చాయని అన్నారు.
Also Read: Heatwave in Khammam: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్!
అనునిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదు విద్యార్థులు, సబ్బండ వర్గాల ప్రజలు, మేము అందరం కలిసి పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడ లేని వ్యక్తి బహిరంగ సభలకు వచ్చి మాట్లాడుతున్నాడని ఎద్దేవ వేశారు. కెసిఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీకి వస్తే మీరేం చేశారు అనేది ప్రజల ముందే చర్చ చేస్తాం అని 1000 జన్మలెత్తిన టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదని అన్నారు.