Heatwave in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ ఉదయం నుండే ఎండ, వడ గాలులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉండటం వలన, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ప్రజలు ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు బయటికి రావొద్దని, ఏవైనా అత్యవసరమైన పనులు ఉంటేనే ప్రజలు ఉదయం సాయంత్రం సమయాల్లో పూర్తి చేసుకోవాలని మధ్యాహ్నం వేళలో ప్రజలు బయటకు వచ్చి వడదెబ్బకు గురి కావద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు.
Also read: Telangana Police Jobs: నిరుద్యోగులు రెడీగా ఉండండి.. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల జాతర
వ్యవపాయ పనులను ఉదయం, సాయంత్రం చేసుకోవాలని, గ్రామాల్లో ఎండ వేడిమికి చెట్ల కింద సేదతీరాలని సూచించారు.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
ఎండకు తట్టుకోలేక చాలా మంది అస్వస్థకు గరవుతుంటారు. వేసవి కాలంలో చెమట ఎక్కువగా బయటికి వస్తుంటది కాబట్టి అలా కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటారు.