Neem Tree: వేప చెట్టు లేని ఊరు ఉండదంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఊరు, గ్రామం, టౌన్, నగరం ఇలా ఎక్కడ చూసిన వీధికో వేప చెట్టు దర్శనమిస్తూనే ఉంటుంది. అయితే వాటిని మనం నీడకో లేదంటో ఉగాది రోజున పచ్చడి కోసం వేప చెట్టును వినియోగిస్తుంటాం. అయితే వేపను ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. అటువంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం. వేప చెట్టుకు కాసే కాయల ద్వారా నెలకు రూ.45,000 ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం.
వేప చెట్టుకు కాసే వేపకాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వేపకాయలను ఆయిల్ తయారీ, వేపపెస్టిసైడ్‌లు, ఔషధాలు తయారీకి ఉపయోగిస్తుంటారు. కాబట్టి వేప కాయలను కిలోకు. రూ.18 నుంచి రూ.25 వరకు విక్రయిస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి వేపకాయ ధరల ఒక్కో విధంగా మారుతుంటుంది. సాధారణంగా ఒక వేప చెట్టు నుంచి సగటున 20-50 కిలోల వరకూ వేపకాయలు వస్తుంటాయి. సాధారణంగా ఒక చెట్టుకు 30 కిలోల వేపకాయలు వేసుకుంటే కిలోకు రూ.15 రూపాయల చొప్పున రూ. 450 వరకు సంపాదించవచ్చు. అదే 10 చెట్లు అయితే రూ.4500, 50 చెట్లకు రూ.22,500, 100 చెట్లు అయితే ఏకంగా రూ.45,000 సంపాదించవచ్చు.
వేపకాయలను చెట్టు నుంచి తెంపిన వెంటనే అమ్మకూడదు. వాటిలోని తేమ పోయేవరకూ ఆరపెట్టాలి. కాయలు సురక్షితంగా ఉండే విధంగా భద్రపరచాలి. అలా ఉంచిన వాటిని మధ్యవర్తులకు.. లేదా కంపెనీలకు నేరుగా విక్రయించవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే మంచి ధరను పొందే అవకాశం ఉంటుంది. కిలోకు రూ.18 – 25కు కూడా విక్రయించవచ్చు.
ఆదాయం ఇలా పొందవచ్చు
ఒక చెట్టు నుండి 30 కిలోల వేపకాయలు వచ్చాయని అనుకుందాం. వీటిని కిలో రూ. 20 వంతున విక్రయిస్తే వచ్చే ఆదాయం రూ. 600 లు. అదే గ్రామంలో 10 చెట్లు ఉంటే మనకు వచ్చే ఆదాయం అక్షరాలా రూ. 6000. ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి పెరగనువచ్చు.. అలాగే తగ్గనువచ్చు. పెద్ద పరిమాణంలో ఉన్న వేపకాయలను బయటి మార్కెట్ లో గిరాకీ ఎక్కువ. వేప గింజలతో వేప నూనె తయారవుతుంది. అంతేకాదు పలు మందుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారని చెబుతారు.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
అలాగే ఆర్గానిక్ ఎరువుల తయారీలో వేపకాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే బయటి మార్కెట్ లో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వేపకాయలు విక్రయిస్తే లాభం తప్ప నష్టం ఉండదన్నది పలువురు వ్యాపారుల అభిప్రాయం. అందుకే కాబోలు గ్రామీణ ప్రాంతాలలో వృద్ధులు ఈ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏ ఆదాయం లేదు అనే వారికి ఇదొక మంచి ఆదాయాన్ని సమాకూర్చే వ్యాపారమని చెప్పవచ్చు. అందుకే అంటారు వృక్షో రక్షతి రక్షితః అని. చెట్టును మనం రక్షిస్తే మనల్ని ఆ చెట్టు కంటికి రెప్పలా చూసుకుంటూ రక్షిస్తుందని చెబుతారు. ఇది నిజం.. అందుకు ఇదే ఉదాహరణ.