Ramakrishna Rao (imagecredit:facebook)
హైదరాబాద్

Ramakrishna Rao: తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!

హైదరాబాద్: Ramakrishna Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె.రామకృష్ణారావు ను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తు న్నారు.

శాంతి కుమారి పదవి కాలం ఈనెల 30న ముగియ నుండ డంతో తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు. 1990 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు.

Also Read: Mahesh Kumar Goud: కవిత వ్యాపారాలు, కేసీఆర్ కుటుంబం.. పై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్ తరువాత రామకృష్ణారావు సీనియర్‌ గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుం దన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారని సమాచారం.

రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌, గుంటూరు కలెక్టర్‌ గా కూడా విధులు నిర్వహిం చారు. రామకృష్ణారావు మే 1 నుండి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించనున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?