minister seethakka(image credit:X)
హైదరాబాద్

minister seethakka: మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలి.. మంత్రి సీతక్క !

minister seethakka: మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలని, ఆ పుస్తకాలు ఎందరికో ప్రేరణ గా నిలుస్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్​ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను  భారత్ సమ్మిట్ ప్రతినిధులు కలిసి సందర్శించారు.

స్వయం సహాయక సంఘాలు మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి క్యాంటీన్ విజయ గాధ లఘు చిత్రంతోపాటు పేరణి, శివతాండవం ఇతర తెలంగాణ నృత్య రూపాలను ప్రదర్శించారు. స్వయం సహాయక మహిళలు విదేశీ ప్రతినిధులతో తమ వ్యాపార అనుభవాలను పంచుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించినట్లు మహిళలు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో బీమా ప్రమాద బీమా ఇవ్వడంతో మహిళా సంఘాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, పెట్రోల్ బంక్ నిర్వహణ, ఐకేపీ కేంద్రాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ, ఇతర అనుభవాలను మహిళలు సమ్మిట్​ ప్రతినిధులకు వివరించారు. జిల్లా సమాఖ్యల సభ్యులు తమ అనుభవాలు పంచుకున్న తర్వాత మంత్రి సీతక్క మాట్లాడారు.

Also read: Mahesh Kumar Goud: కవిత వ్యాపారాలు, కేసీఆర్ కుటుంబం.. పై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

రాధ ఐకేపీ సెంటర్ ను విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె ఇప్పుడు చదువుకోవాలనుకోవడం అభినందనీయం. రాధ జీవిత స్టోరీని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. ఆమెలో నన్ను నేను చూసుకుంటున్నాను. నేను కూడా 10 తో చదువు ఆపేశాను. అజ్ఞాతం వీడి జనజీవనం లోకి వచ్చిన తర్వాత చదువు కొనసాగించాను.

ఎల్​ఎల్​ బీ, ఎల్​ ఎల్​ ఎం, పీహెచ్​ డీ చేశాను. రాధ ఆశయం, ఆత్మ గౌరవం పుష్కలంగా ఉంది. కష్టాలను ఎదిరించి ఈ స్థాయికి వచ్చారు.. ఆమె కష్టంతో కుంగి పోతే ఈ స్థాయికి వచ్చేది కాదు అని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సక్సెస్ స్టోరీలను విదేశీయులు వింటున్నారని, రాష్ట్రానికి ఎవరొచ్చినా మిమ్మల్ని కలవకుండా వెళ్లే పరిస్థితి లేదన్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని మహిళా సంఘాలు ఆర్థిస్తున్నాయని, ప్రతి గ్రూపు కోటి రూపాయలు సంపాదించేలా పనిచేయాలన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!