PM Modi Amaravati Visit: అమరావతి,25 ఏప్రిల్:మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న సభా వేదిక ప్రాంగణంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడలు అధికారి వీరపాండ్యన్ సంబంధిత నోడలు అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు.
ఈసందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ వివిధ టాస్కులు కేటాయించిన అధికారులు ఆయా పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. టెంటటివ్ కార్యక్రమం ప్రకారం ప్రధాని మోడి మే 2న మధ్యాహ్నం 3గం.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయానికి చేరుకుని 1.4కి.మీల మేర రోడ్ఖు షో ద్వారా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు.
తదుపరి సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి శంఖుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నట్లు చెప్పారు.
సభ అనంతరం సా.5.గం.లకు సభా ప్రాంగణం నుండి హెలీకాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ బయలు దేరుతారని చెప్పారు. ప్రధాని సభకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రముఖులు చేరుకునేలా 8 రూట్లను సిద్ధం చేయడం జరుగుతోందని, వాహనాలు పార్కింగ్ కోసం 9 పార్కింగ్ స్థలాలను గుర్తించి అక్కడ తాగునీరు,ఆహారం, మరుగుదొడ్లు వంటివి వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ వేగవంతుగా పూర్తి చేయాలని వివిధ టాస్క్ లు కేటాయించిన అధికారులను వీరపాండ్యన్ ఆదేశించారు.
ఈనెల 30వ తేదీన రిహార్సల్ ఉంటుందని, తదుపరి ఎస్పిజి రిహార్సల్స్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలందరికీ పూర్తి స్థాయిలో ఆహారం అందించడం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఆయా పార్కింగ్ ప్రాంతాల్లో సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా పలు ఏర్పాట్లకు సంబంధించి ఆయా నోడలు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈసమావేశంలో అదనపు డిజిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని సభకు 100 మందికి పైగా వివిఐపిలు, 15 మంది వరకు ఎంఐపిలు, 5వేల మంది వరకు విఐపిలు రానున్నారని అందుకు అనుగుణంగా పార్కింగ్ ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతంలో నిరంతరం మైక్ అనౌన్స్మెంట్ చేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ డ్యూటీ పాస్లుకు సంబంధించి ఆయా శాఖలు వెంటనే జాబితా ఇవ్వాలని కోరారు. ఇంకా ఈసమావేశంలో ఐజి శ్రీకాంత్,గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, సియుం త్రివిక్రమ్ వర్మ,పలువురు పోలీసు ఉన్నతాధికారులు, నోడలు అధికారులైన పలువురు ఐఏఎస్,ఐపిఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు