Karregutta: మావోయిస్టులు, కేంద్ర ప్రభుత్వం మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇందులో అమాయక ఆదివాసీలు, పసిపిల్లలు సమిధలు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్ పేరుతో కర్రెగుట్టలో చేపట్టిన కాల్పులు వెంటనే ఆపేయాలి. శాంతి చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం – పౌర సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఆదివాసీలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ఇచ్చింది. షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసీ ప్రజల అనుమతులతోనే ఆ ప్రాంతాలకు వెళ్ళాలి. అవన్నీ పట్టించుకోకుండా కేంద్ర వారి హక్కులను హరిస్తుందన్నారు. ఆదివాసీలకు చేసిన వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. శాంతి చర్చలు జరిపితే అటు మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న సమస్య తొలగిపోతుందన్నారు.
శాంతి చర్చల ద్వారానే రక్తపాతం లేకుండా సామాజిక, ఆర్థిక విప్లవాత్మక మార్పులు తేవచ్చన్నారు. చర్చలకు వెళ్తే ఆదివాసీల సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు. అమాయకుల ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నెల రోజుల గడువు ఇస్తే, మావోయిస్టు పార్టీలోని అన్ని విభాగాలు చర్చలకు సిద్దమవుతాయన్నారు. విప్లవ పార్టీ చర్చలకు సిద్ధంగా ఉన్నపుడు, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఎందుకు స్పందించట్లేదు. కగార్ యుద్దాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలి. శాంతి చర్చలకు పౌరసమాజం కూడా హర్శిస్తుందన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు