వివాహేతర సంబంధాలు అనేవి ఈ రోజుల్లో సర్వ సాధారణం. కట్టుకున్న వాళ్ళతో బంధం తెంచుకుని రకరకాల కారణాలు చూపుతూ వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాల వలన అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు మధ్యలోనే విడిపోతున్నారు.
నేటి సమాజంలో ఇలాంటి ఎఫైర్స్ వల్ల నిండు జీవితాలు బలైన ఘటనలు చాలానే ఉన్నాయి. భార్యకు తోడుగా ఉండాల్సిన భర్త, భార్య ఉండగానే మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్న మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. దీప్తి అనే మహిళని వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టారు. ఈ ఇద్దరు దంపతులకు మూడేళ్ల పాప కూడా ఉంది. అయితే, పరాయి స్త్రీ తో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్య దీప్తి కి దూరంగా ఉంటున్నాడు.
Also read: Dharmapuri Arvind On KCR: కేసీఆర్ ఫ్యామిలీని ఏకిపారేసిన బీజేపీ ఎంపీ.. మరీ ఇంత ఘోరంగానా!
మూడో వ్యక్తి కారణంగా భార్య భర్తలు గత కొంతకాలంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తనను పట్టించుకోకుండా సుష్మ అనే మహిళతో కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకుని, బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్‌గా దీప్తి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివ.. వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకుని అతని భార్య దీప్తి రెడ్ హ్యాండెడ్‌గా దీప్తి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.