Phone Tapping case( image credit; al or TWITTER
హైదరాబాద్

Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కుట్రపై తుది తీర్పు వచ్చేనా? 29న మరో కీలక రోజు!

Phone Tapping case: ఫోన్​ట్యాపింగ్​కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్​రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్​పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై  హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభాకర్​తరపున న్యాయవాది నిరంజన్​రెడ్డి వాదనలు వినిపించారు. ‘ నా క్లయింట్‌కు ముందస్తు బెయిల్​మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్​తిరిగొస్తారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తారు.

30 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించటం ద్వారా అనేక గుర్తింపులు కూడా దక్కించుకున్నారు. 65 ఏళ్ల వయసులో ఉన్న ప్రభాకర్ ​క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతున్నారు. ఫోన్​ట్యాపింగ్ ​కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్​రావును అరెస్ట్​చేయవద్దంటూ సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే కేసులు నమోదు చేశారు.

 Also Read: Pakistan Man In Hyderabad: హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడి వివాహం? అరెస్ట్ చేసిన పోలీసులు?

ఫోన్​ట్యాపింగ్​ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న దాంట్లో నిజం లేదు’ అని కోర్టుకు నిరంజన్​వివరించారు. కాగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్​సిద్దార్థ్​లూథ్రా 65 ఏళ్ల వయసు ఉందన్న సాకుతో విచారణ నుంచి ప్రభాకర్‌ తప్పించుకోలేరన్నారు. ఆయన ఫోన్​ట్యాపింగ్‌ చేయించారని అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

హార్డ్​డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలోకి విసిరేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభాకర్​రావుకు ముందస్తు బెయిల్​మంజూరు చేయవద్దన్నారు. వాదనలతో కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు