Social Media Film Awards: దేశంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల సమ్మిట్ హైదరాబాద్ లో లాంచ్ అయ్యింది. 7వ ఎడిషన్ సోషల్ మీడియా అండ్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ (Social Media And Film Awards 7th Edition Curtain Raiser Event) టి -హబ్ వేదికగా నిర్వహించారు. సోషల్ మీడియాలో విశేష ప్రతిభ కనబరిచిన ఇన్ ఫ్లూయెన్సర్లకు కళారాజ్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ అవార్డులు అందించనుంది. ఈ కార్యక్రమానికి అధికారిక మీడియా భాగస్వామిగా బిగ్ టీవీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ సీఈవో అజయ్ రెడ్డి (Ajay Reddy) ఈవెంట్ లో పాల్గొని నిర్వాహకులతో కలిసి TSFA 2025 అధికారిక పోస్టర్ ను లాంచ్ చేశారు.
బిగ్ టీవీ జర్నీ..
TSFA 2025 పోస్టర్ లాంచ్ అనంతరం మాట్లాడిన బిగ్ టీవీ సీఈవో అజయ్ రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ జర్నీని ఉదాహరణగా చూపిస్తూ.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేశారు. 2023లో బిగ్ టీవీ చాలా చిన్నగా ప్రారంభమైందని.. క్వాలిటీ కంటెంట్ ను ఇవ్వడంలో ఏ మాత్రం రాజీపడకుండా ఆడియన్స్ ను చేరుకోగలిగామని అన్నారు. గత నెల నెంబర్ 1 డిజిటల్ ఛానెల్ గా బిగ్ టీవీ అవతరించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలినాళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు అజయ్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
ఆ కష్టం నాకు తెలుసు..
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల గురించి మాట్లాడిన బిగ్ టీవీ సీఈవో అజయ్ రెడ్డి.. వారుపడే కష్టాన్ని తన మాటల్లో బహిర్గతం చేశారు. నలుగురిలో గుర్తింపు సంపాదించడం కోసం వారు ఎంతగా శ్రమిస్తారో వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసని అన్నారు. మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించేందుకు వారు చాలా స్ట్రగుల్ అవుతుంటారని తెలిపారు. కాబట్టి వాళ్లకు ఒక వేదికను సృష్టించి వెలుగులోకి తీసుకొని రావాలని ఈవెంట్ నిర్వహాకులు శ్రీనివాసరెడ్డి చెప్పగానే అందుకు అంగీకరించినట్లు తెలిపారు. మీడియా భాగస్వామిగా బిగ్ టీవీని ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా అండ్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ద్వారా నిర్వహకులు మంచి పని చేస్తున్నారని ప్రశంసించారు.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
కొత్త అవకాశాలు..
రీల్స్, సోషల్ మీడియా కంటెంట్ కోసం కష్టపడుతున్న ఇన్ ఫ్లూయెన్సర్లు.. వ్యాపారవేత్తలుగానూ ఎదిగే అవకాశముందని బిగ్ టీవీ సీఈవో అజయ్ రెడ్డి తెలిపారు. ప్రతీ వ్యాపారి తన ప్రొడక్ట్స్ ను అడ్వర్టైజ్ చేయాలని కోరుకుంటాని గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రకటన కోసం వార్త పత్రికలు, టీవీ ఛానళ్లను ఆశ్రయించేవారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల ద్వారా తమ వస్తువులను ప్రమోట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. ఈ వేదిక ద్వారా కళారాజ్ మీడియా, బిగ్ టీవీ ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వ్యాపార కంపెనీలు.. ఈ వేదికపైకి వచ్చి ఇన్ ఫ్యూయెన్సర్లకు ఆర్థికంగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.