Gurukulam Admissions: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సీట్ల భర్తీకి సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏ ఒక్క అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మరియు ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలుగు వర్షిణి ప్రకటన విడుదల చేశారు.
జిల్లా యూనిట్ గా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సీట్ల భర్తీ లో రాష్ట్ర స్థాయి మెరిట్ ప్రకారం సీట్ల భర్తీ చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గురుకుల అధికారుల లీలలు అనే శీర్షికన స్వేచ్ఛ డైలీ లో ప్రచురించిన ప్రత్యేక కథనానికి స్పందించిన పరీక్ష నిర్వహణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలుగు వర్షిణి ప్రకటన విడుదల చేశారు.
మెరిట్ సాధించిన ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చూడాలనేది మా ఉద్దేశ్యం అని ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల్లో సీట్లు సాధించిన వారి సొంత జిల్లాలో సీటు ఖాళీలను బట్టి స్లైడింగ్ కు అవకాశం ఇచ్చి వారి సొంత జిల్లాకు వెళ్లే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.
జిల్లా యూనిట్ గానే సీట్ల భర్తీ జరగాలి
ఉమ్మడి జిల్లా యూనిట్ గా నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్ర మెరిట్ తొ ఇతర జిల్లాల విద్యార్థులకు సీట్లు ఎలా ఇస్తారు…? సీట్ రాని స్థానిక విద్యార్థులు చాలా మంది ఉన్నప్పటికీ, స్థానికేతరులకు సీట్లు ఎలా ఇస్తారు…? రాష్ట్ర యూనిట్ గా సీట్ల భర్తీ చేయడం వలన స్థానిక విద్యార్థులకు అన్యాయం జరగుతుంది ఈ విషయం గ్రహించడం లేదా…? రాష్ట్ర యూనిట్ గా ఇతర జిల్లాల్లో సీట్లు భర్తీ చేస్తే భవిష్యత్ లో ఇతర జిల్లా విద్యార్థులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉంది అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం జర మా బాధ కూడ వినండి అంటూ పరీక్ష నిర్వహణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలుగు వర్షిణి నీ తల్లిదండులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ లో ఇచ్చి పరీక్ష నిర్వహించినట్టే సీట్ల భర్తీ చేయాలి
పరీక్ష నిర్వహణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలుగు వర్షిణి చేసిన ప్రకటనపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టు జిల్లా యూనిట్ గా సీట్ల భర్తీ చేసి ఏ సమస్య లేకుండా చూడాల్సిన అధికారులు రాష్ట్ర యూనిట్ గా సీట్లు భర్తీ చేయడం సమస్యలకు దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు జరిగిన లోపాలను సవరించి ఇకపై నిర్వహించే సీట్ల భర్తీని నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టు జిల్లా యూనిట్ గానే భర్తీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు