Minister Nageswara Rao: మార్కెట్లలో అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించదని, రైతులకు నష్టం కలిగే విధంగా ఎవరూ నడుచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్ విచారణ చేపడుతున్నామని తెలిపారు. విజిలెన్స్ ఇచ్చే విచారణ నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణను వేగంగా పూర్తి చేసి, రిపోర్టును అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి మార్కెటింగ్ సెక్రటరీ, జిల్లా మార్కెటింగ్ అధికారుల నుంచి వివరణ తెప్పించుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు.
Also Read: Fake PA Arrested: మంత్రి పీఏగా నటించి అధికారులపై.. ఒత్తిడి తెచ్చిన నకిలీ గ్యాంగ్ అరెస్టు!
రాష్ట్రవ్యాప్తంగా 197 మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 162 కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించామని మంత్రి తెలిపారు. ఏడాదిన్నర లోపే 2,268 నామినేట్ పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. మార్కెట్లలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట పడేవిధంగా, రైతులకు గరిష్ట మద్ధతు ధర వచ్చే విధంగా, రైతులకు కావాల్సిన కనీస వసతులు కల్పించే దిశగా ఈ పాలకవర్గాలు పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వేగంగా కమిటీలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మార్కెట్ కమిటీలతో పాటు ఆత్మ, ఇతర నామినేటెడ్పోస్టులను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు