Shahrukh Khan Consoles Gautham Gambhir After KKR Defeat
స్పోర్ట్స్

IPL 2024: కేకేఆర్ టీమ్‌ని ఓదార్చిన షారుక్‌ ఖాన్‌

Shahrukh Khan Consoles Gautham Gambhir After KKR Defeat: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను జోస్ బట్లర్ పోరాటం కారణంగా చేజార్చుకుంది. ఈ ఓటమి నేపథ్యంలో కేకేఆర్ ఆటగాళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. సునీల్ నరైన్ శతకం సాధించిన మ్యాచ్‌లో ఈ అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయారు.

కేకేఆర్ మెంటార్‌ గౌతమ్ గంభీర్‌తో పాటు జట్టు ఆటగాళ్లంతా మౌనంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. కేకేఆర్ ఆటగాళ్లు బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన ఆ జట్టు ఓనర్ షారుక్‌ ఖాన్.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వారిని ఓదార్చాడు.స్పూర్తిదాయకమైన మాటలతో వారిలో ఉత్సాహాన్ని నింపాడు. మరీ ముఖ్యంగా గౌతమ్ గంభీర్‌కు బాధపడవద్దని సూచించాడు. క్రీడల్లోనైనా, జీవితంలోనైనా కొన్నిసార్లు ఓటమికి, విజయానికి అర్హులం కాదని, కానీ ఈరోజు మనం గెలవాల్సిందని, అంతేకాకుండా టీమ్ సభ్యులు అద్భుత ప్రదర్శన కనబరిచారని షారుక్ అన్నారు.

Read More:ఆర్‌సీబీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టెన్నిస్ ప్లేయర్‌

ప్రతీ కేకేఆర్ అభిమాని తలెత్తుకునేలా ఆడారు. కాబట్టి ఎవరూ కూడా బాధపడవద్దు, నిరాశ చెందవద్దని సూచించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పటిలానే ఉత్సాహంగా ఉండండి. ఇక్కడో ఎంతో శక్తి ఉంది. ఈ శక్తినే మనం మైదానంలోకి తీసుకెళ్లాలి. నాతో సహా జట్టులోని ప్రతీ ఒక్కరి మధ్య మంచి బంధం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ బాండ్‌ని ఇలానే కొనసాగించండి.ఆల్‌ది బెస్ట్..నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. గౌతమ్ గంభీర్.. మీరు ఏ మాత్రం బాధపడకండి. మనం మళ్లీ పుంజుకుంటామని షారుక్‌ స్పూర్తిని నింపారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?