Fake PA Arrested: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పీఏని అంటూ ఒక కేటుగాడు ప్రభుత్వ అధికారులు, పోలీస్అధికారులు, ఎమ్మెల్యే పీఏకి ఫోన్ చేసి, పనులు చేయాలని పలు రకాలుగా ఒత్తిడి తెచ్చి, పనులు చక్కబెట్టుకుంటున్న తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత కాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పీఏను అంటూ ఓ వ్యక్తి నంబర్‌నుంచి పలువురికి ఫోన్ చేస్తూ.. తనకు సంబంధించిన పనులు చేసిపెట్టాలని అభ్యర్థిస్తున్నాడని, తనకు కూడా కాల్ చేశాడని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పీఏ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తన సిబ్బందితో విచారణ చేయించగా.. సదరు ఫోన్నంబర్నాగోల్ పరిధిలోని మమతా నగర్లో నివాసముండే బుస్సా వెంకట్‌రెడ్డి, మచ్చ సురేశ్ అనే ఇద్దరు వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయ డీపీవో(డేటా ప్రాసెసింగ్ఆఫీసర్) పేరాల నరేశ్నాగోల్పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్ కు తరలించారు.
సీఐ సూర్యనాయక్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా , చిట్యాల గ్రామానికి చెందిన బుస్సా వెంకట్‌రెడ్డి(34) నిరుద్యోగిగా .. నాగోల్పరిధిలోని మమతా నగర్లో నివాసముంటున్నాడు. నిరుద్యోగిగా ఉంటూ.. ఈజీ మనీకి అలవాటు పైరవీలు మొదలు పెట్టాడు. నాగోల్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్ కి చెందిన మచ్చ సురేశ్ (30) ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి పక్కా ప్లాన్‌తో తమ సొంత నంబర్ కాకుండా స్థానికంగా ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే తన స్నేహితుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్ము వెంకట్ పేరుమీద ఉన్న సిమ్‌నంబర్:9966664882 ను వాడుతున్నారు.
గత ఏడాది నవంబర్‌నుంచి తరుచుగా నగరంలోని ప్రభుత్వ, పోలీసు అధికారులకు, రాజేంద్రనగర్ఎమ్మెల్యే పీఏ తదితరులకు ఫోన్లు చేస్తూ.. పలు విధాలుగా సాయం అభ్యర్థిస్తూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్పీఏకు కాల్చేసి ఓ బీటెక్విద్యార్థికి లెటర్ప్యాడ్ఇవ్వాల్సిందిగా కోరారు.
ఆయన కూడా లెటర్ప్యాడ్ఇప్పించాడు. అనంతరం ఎమ్మెల్యే పీఏకు మంత్రి పేషీలో పని సాయం కోసం వెంకట్‌రెడ్డికి కాల్చేయగా.. అతడు ఫేక్అని తేలింది. దీంతో వెంటనే మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. వెంకట్‌రెడ్డి, సురేశ్ ఇప్పటి వరకు మొత్తం 11 మంది ఆయా శాఖల అధికారులకు కి ఫోన్లు చేసి, మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పేరు చెప్పి వత్తిళ్లు చేసి, పలు రకాల సాయం అభ్యర్థించినట్లు గుర్తించారు
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు