Ghatkesar VBIT Hostel: తెలంగాణలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ హాస్టల్ లో కామంధులు రెచ్చిపోయారు. అమ్మాయిలు స్నానాలు చేస్తున్న సమయంలో నగ్నచిత్రాలు, వీడియోలను చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్టల్ వార్డెన్, స్టాఫ్, ఉపాధ్యాయులు.. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
నగ్న వీడియోలు చిత్రీకరించిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినులు.. భారీ ఎత్తున నిరసనకు దిగారు. బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బాత్రూమ్ లో రహస్యంగా కెమెరాలు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని పట్టుబడుతున్నారు. విద్యార్థినుల ఆందోళనతో కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read: Bar Staff Arrested: మందుబాబులారా జాగ్రత్త.. టాప్ బ్రాండ్స్ లోనూ కల్తీ.. ఆదమరిస్తే చిత్తే!
అయితే గతంలోనూ సదరు ఇంజనీరింగ్ కాలేజీ వార్తల్లో నిలిచింది. యువతుల మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో విద్యార్థినులు ఆందోళన బాట పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో ఓ వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా 8 మంది ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.