Hyderabad Alert: కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు (Hyederabad Police) అప్రమత్తమైన సంగతి తెలిసిందే. రద్దీ ప్రాంతాల్లో బందోబస్తును పెంచిన పోలీసులు.. అనుమానితులపై దృష్టిసారించారు. వారి ప్రతీ కదలికను పరిశీలిస్తూ.. క్షణ క్షణం నిఘా పెట్టారు. మరోవైపు భారత్ లోనూ పాక్ ప్రజలు తక్షణమే వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పాక్ పౌరులను తిరిగి పంపించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also Read: Bar Staff Arrested: మందుబాబులారా జాగ్రత్త.. టాప్ బ్రాండ్స్ లోనూ కల్తీ.. ఆదమరిస్తే చిత్తే!
హైదరాబాద్ లో పాక్ దేశానికి చెందిన 208 పౌరులు నివసిస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. రెండు రోజుల్లో భారత్ విడిచి వెళ్లిపోవాలంటూ సైతం గట్టి సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు పాక్ పౌరుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.