Jagtial crime: ఇటీవలే రోజుకొక వింత ఘటన వెలుగులోకి వస్తుంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఎవరూ ఊహించలేకపొతున్నారు. ముఖ్యంగా, భార్య భర్తల మధ్య జరిగే చిన్న గొడవలు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో భార్యను చంపేసిన భర్త, భర్తను పొడిచిన భార్య.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనైతే మరి దారుణం, ఓ భర్త అనుమానంతో భార్యను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: NVSS Prabhakar: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ నేత పహల్ గావ్ దాడిని గుర్తు చేస్తూ హెచ్చరిక!
జగిత్యాల జిల్లాలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న(29)కు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ప్రస్తుతం, వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా వర్క్ చేస్తున్నారు. కొన్ని నెలలు వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చిన సర్దుకుపోయారు. అయితే, ఏడాది కిందట వీరికి కొడుకు పుట్టాడు. ఆ బాబు తెల్లగా, అందంగా ఉన్నాడని ఆమెను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. ఇక చేసేదేమి లేక లక్ష్మీ ప్రసన్న జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉండేది.
ఇది మాత్రమే కాకుండా, కట్నం డబ్బులు కూడా మొత్తం ఇవ్వలేదంటూ అత్తమామలతో కూడా కాల్స్ చేసి గొడవ పడుతూ ఉండేవాడు. ఓపిక నశించిన లక్ష్మీ ప్రసన్న ఐదు రోజుల క్రితం జగిత్యాలలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. భర్తకు ఉన్న వింత అనుమానంతో ఆమె రోజూ లోలోపల నరకం అనుభవించేది. బిడ్డను చూసినప్పుడల్లా భర్త అన్న మాటలను గుర్తుకొచ్చి మానసికంగా చాలా నలిగిపోయింది. బాధతో గుండె బరువెక్కిన లక్ష్మీ ప్రసన్న చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన స్వంత గ్రామంలో ఉన్న ఇంట్లో సూసైడ్ చేసుకుని ఆ బిడ్డను తల్లి లేని అనాధగా చేసింది.
Also Read: Imanvi Sensational Post: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రభాస్ పౌజీ హీరోయిన్ సంచలన ప్రకటన.. పోస్ట్ వైరల్
ఆమె చనిపోయే ముందు ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. మీరే పెంచండి ప్లీజ్.. వాళ్ల నాన్నకు మాత్రం నా కొడుకుని అసలు ఇవ్వకండి’ అని రాసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు చనిపోవడానికి భర్త, అత్తమామల వేధింపులే కారణమని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఫిర్యాదు చేయగా, తిరుపతి ,అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు