Imanvi Sensational Post: స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ఫౌజీ’(Fouji) కూడా ఒకటి. ఈ చిత్రానికి హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇమాన్వీ(Imanvi) కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ చిత్రంగా మన ముందుకు రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు.
జమ్మూ కశ్మిర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా భారతీయులు నిరసనలు చేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నటీ నటుల వరకు ఈ విషాదకర ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదే నేపథ్యంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు పెట్టిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే, తాజాగా పహల్గామ్ ఘటనపై ప్రభాస్ పౌజీ హీరోయిన్ ఇమాన్వి సంచలన పోస్ట్ పెట్టింది. ” పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనకు నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని తెలిపింది. ఈ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా కాంతిని, ప్రేమను పంచడం ఎల్లప్పుడూ లక్ష్యం అయిన వ్యక్తిగా, మనమందరం ఒక్కటిగా కలిసివచ్చే రోజు త్వరలో చూడాలని నేను ఆశిస్తున్నాను అని అన్నది. నా పై కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారు. నా కుటుంబం గురించి కూడా ప్రస్తావిస్తూ పుకార్లు పుట్టించి అబద్ధాలు చెబుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెబుతాను.
నా కుటుంబ సభ్యులకు, పాకిస్తానీ మిలిటరీకి ఎలాంటి సంబంధాలు లేవు. మీకు వ్యూస్ రావడం కోసం ఆన్లైన్ లో ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. ప్రముఖ వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ఉన్నవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే భారతీయ అమెరికన్ ను అని అన్నారు. నేను లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో జన్మించాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు యువతగా వలస వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అమెరికా పౌరులుగా మారారు. USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటిగా, కొరియోగ్రాఫర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించానని చెప్పింది.
కానీ, నెటిజన్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఫౌజీ మూవీ నుంచి వెంటనే ఆమెను తొలగించాలంటూ పెద్ద ఎత్తున పోస్ట్ లు పెడుతున్నారు. పాక్ నటీ నటులకు మన ఇండియన్ సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి, ఈ హీరోయిన్ కి ఎందుకు లింక్ పెడుతున్నారు అంటూ ఇంకొందరుఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు