Sircilla Crime: మనిషి పైశాచికత్వానికి పరాకాష్ట ఈ ఘటన. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ దుర్ఘటన మాత్రం కాస్త భిన్నమేనని చెప్పవచ్చు. కుక్కర్ లో భార్య శరీరాన్ని వేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటనను తెలంగాణలో మరిచిపోక ముందే అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన ఒకరు ఓ వివాహితను హత్య చేసి అనంతరం తాను కూడా ఉరివేసుకొని చనిపోయారు. గ్రామానికి చెందిన చెరుకూరి రేఖా (25) అనే వివాహితను అతికిరాతకంగా ఉల్లి శ్రీకాంత్ చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
దారుణంగా అత్యాచారం
మృతురాలికి భర్త దుబాయిలో ఉంటుండగా.. రేఖ తన ఇద్దరు పిల్లలలో జీవిస్తోంది. ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ విచక్షణ కోల్పోయి.. రేఖను బలవంత పెట్టాడు. శరీర భాగాలు కొరుకుతూ మానభంగం చేశాడు. ఆపై కొడవలితో ఆమెను నరికి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
Also Read: Be Alert Vijayawada: క్షణ క్షణం.. భయం భయం.. నగరంలో 10 మంది ముష్కరులు?
పోలీసులు అప్రమత్తం
ఈ ఘటన సమాచారం దావాలంలా చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించింది. దీంతో స్థానికంగానూ తీవ్ర సంచలనం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘటన జరిగిన గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం గజసింగవరం గ్రామంలో భారీగా బలగాలు మోహరించి ఉన్నాయి. డీఎస్పీ, సీఐ ర్యాంక్ అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.