Shakeel Son accident case: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023,డిసెంబర్ లో షకీల్ కుమారుడు రాహిల్ మద్యం మత్తులో ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ కొడుకును తప్పించి తన వద్ద పని చేస్తున్న ఉద్యోగిని పోలీసుల వద్ద సరెండర్ చేయించాడు. దీనికి అప్పట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న దుర్గారావుతోపాటు బోధన్ సీఐ సహకరించారు. కాగా, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జరిపిన విచారణలో రాహిల్ యాక్సిడెంట్ చేసినట్టుగా వెళ్లడయ్యింది.
ఈ క్రమంలో రాహిల్ తోపాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కేసులో నిందితునిగా చేర్చారు. ఆ వెంటనే షకీల్ దుబాయ్ వెళ్లిపోయారు. ఇటీవల తన తల్లి అంత్యక్రియల నిమిత్తం అతను రాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి అంత్యక్రియలు ఉన్నాయని చెప్పటంతో దానికి అనుమతించారు.
కాగా, అంత్యక్రియలు ముగిసిన నేపథ్యంలో షకీల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. షకీల్ పై నమోదైన కేసుల్లో 7సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు