Indus Waters Treaty: పాకిస్తాన్ పన్నిన ఉగ్ర కుట్రకు మన దేశం వేసిన స్కెచ్ ఎలాంటిదంటే, ఇక జన్మలో ఉగ్రదాడి అనే మాట పలికేందుకు శత్రు దేశం సాహసించదు. అలాంటి నిర్ణయం మన దేశం తీసుకోవడంతో పాకిస్తాన్ దేశంలోని ప్రజలే అక్కడి ఉగ్రవాదులకు ఛీ.. ఛా అనే రోజులు వచ్చాయి. శాంతి కోరుకొనే మన దేశంపై తన బుద్ధి మార్చుకోకుండా, పాకిస్తాన్ చేసిన కుట్రను ప్రధాని మోడీ తన మార్క్ రివేంజ్ చూపించారు. దీనితో పాకిస్తాన్ లో సైతం ఆందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కుట్ర కోణం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మాకు తెలియదు, సంబంధం లేదు అంటూ పాకిస్తాన్ పాత పాట పాడినా, మన దేశంలో ఉన్న వారి కార్యాలయంలో కేక్ కట్ చేసే సాహసం చేయడం అంటే ఇది క్షమించరాని నేరమే. పహల్ గామ్ లక్ష్యంగా పర్యాటకులపై దాడికి పాల్పడ్డ ముష్కరులు 28 మందిని పొట్టన పెట్టుకోవడంతో యావత్ భారత్ రక్తం ఉడుకుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ సైతం పలు కీలక సమావేశాలు నిర్వహించి, పాకిస్తాన్ ను దెబ్బతీసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను తుద ముట్టించడంలో భారత్ సైన్యం ఉంటే, పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు నెత్తినోరు కొట్టుకొనే పరిస్థితికి దిగజార్చిన ఘనత మన దేశంది. ఇంతకు అంతలా మన దేశం తీసుకున్న నిర్ణయం ఏమిటి? పాకిస్తాన్ కు ఆ దేశ ప్రజలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం.
రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరిపిన ప్రధాని మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క బాణంగా పాకిస్తాన్ కు తగిలింది. పాక్ పౌరులు, పర్యాటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం చెప్పింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని, ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరని, ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలన్న ఆదేశాలు వెలువడ్డాయి.
గడ్డి మొలవని రోజులు..
ఉగ్రవాదమే మా స్టైల్ అంటూ పాకిస్తాన్ చేసే దుశ్చర్యలకు మన దేశం ఎన్నో సార్లు పాపభీతి చూపింది. కానీ దానినే ఆసరాగా చేసుకున్న పాకిస్తాన్ బుద్ధి మార్చుకోలేదు. అందుకే కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయం మాత్రం పాకిస్తాన్ ను తెగ వణికిస్తోందట. అదే సింధు జలాల ఒప్పందం. గతంలో పలు మార్లు ప్రధాని మోడీ సైతం ఇదే విషయంపై మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. సింధు జలాల పేరుతో రక్తం, నీరు ఒకే చోట ప్రవహించే ప్రసక్తే లేదని మోడీ చెప్పుకొచ్చారు. కానీ పాకిస్తాన్ బుద్ధి మారదు కదా, అందుకే శాంతి అనే తత్వంతో ఉన్న మన దేశాన్ని గెలికింది. ఇప్పుడు ఏకంగా 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయడం అనేది పాకిస్తాన్ కు ఇదొక చెంపపెట్టు.
ప్రపంచ పటంలో ఎక్కడో ఉన్న పాకిస్తాన్ కు నీరు తక్కువ. భారత్ పుణ్యమా అంటూ ఇన్ని ఏళ్లు దాహపు కేకలు వినిపించలేదు. అక్కడ వ్యవసాయం సాగించాలన్నా, సింధు జలాలు అవసరం. ఆ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు సైతం గుర్రుగా ఉన్నారట. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్ ను ఇబ్బందిపెట్టే రీతిలో అక్కడి సైన్యం చేస్తున్న నిర్వాకానికి ప్రజలు ఛీ అనే స్థాయి భారత్ తెచ్చిందని చెప్పవచ్చు.
సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2023లో దీనిపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్ కు తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి సింధూ జలాలను కట్ చేసి పారేసింది.
Also Read: Imanvi Sensational Post: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రభాస్ పౌజీ హీరోయిన్ సంచలన ప్రకటన.. పోస్ట్ వైరల్
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మన దేశ ప్రజలు హర్షిస్తున్నారు. పాపం అనే ధోరణి ఇప్పటికైనా విడనాడి పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మతం పేరుతో జరిగే దాడులను పక్కా ప్లాన్ తో తిప్పికొట్టి, పాకిస్తాన్ కు రివేంజ్ గట్టిగా ఇవ్వాలని నెటిజన్స్ కోరుతున్నారు. మరి ఆ టైమ్ కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ ను బట్టి, పాకిస్తాన్ కు ఇక చుక్కలేనని చెప్పవచ్చు.