Hyderabad Metro Betting Apps: గత కొంత కాలంగా రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన బెట్టింగ్ ఆప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అడ్వకేట్ నాగూర్ బాబు మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్ ఫై హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలు లో IAS లు IPS లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారు ని పిల్ వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్స్ ఆప్స్ పై కఠిన నిర్ణయం తీసుకుని నిషేధం విధించినప్పటికీ మెట్రో రైళ్లలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. నిషేధిత బెట్టింగ్స్ ఆప్స్ పై ఈడీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రకటనలపై ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై CBI ఎంక్వయిరీ వెయ్యాలని హైకోర్టును కోరారు.
HMRL లేదా అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్ ఆప్ ప్రమోట్ చేయడానికి ఎన్నికోట్ల ముడుపులు తీసుకున్నారో ED దర్యాప్తు చేయాలని పిటిషనర్ అడ్వకేట్ నాగూర్ బాబు కోరారు.
తెలంగాణ గేమింగ్ అమండమెంట్ act 2017, అమల్లో ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో మెట్రో రైలు ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రతి వాదులను హైకోర్టు ఆదేశించింది.
Also read: Duvvada Srinivas: బలి చేశారు.. సస్పెన్షన్ పై దువ్వాడ ఫైర్..
మెట్రో రైలు సంస్థ తరపు న్యాయవాది మాట్లాడుతూ మెట్రో రైళ్లలో 2022 నుండి ఎలాంటి బెట్టింగ్ యాడ్ప్ ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరగా న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే సోమవారంకు వాయిదా వేసింది.